Advertisement
సాధారణంగా మన జీవితంలో మనం ఎప్పుడో ఒకప్పుడు రైలు ప్రయాణం చేసిన వాళ్లమే. అంతేకాదు.. రైలు బోగీలపై రకరకాల అక్షరాలు, గుర్తులు కనిపించినప్పుడు ఇవి ఏంటో అనే డౌట్ కూడా మనకు వచ్చే ఉంటుంది. అయితే ప్రయాణం హడావుడిలో పడి ఆ విషయాన్ని మరుక్షణమే పక్కన పెట్టేస్తాం. ప్రతీ రైలులో చివరి బోగీపై X లేదా LV అని ఇంగ్లీషు అక్షరాలతో రాసి ఉండటం మనం గమనించే ఉంటాం. ఇలా వీటిని ఎందుకు రాస్తారో అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగి ఉంటే.. ఇప్పుడు మీకు డౌట్ తీరినట్టే.
Advertisement
రైల్వే అధికారుల ప్రకారం.. రైలులో చివరి బోగీపై X లేదా LV అని రాసి ఉంటే ఆ బోగీ చివరిది అని అర్థం. ఒకవేళ రైలు చివరి బోగీలో అలా రాసి ఉండకపోతే వెంటనే స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అవుతాడు. చివరి బోగీ ట్రైన్ నుంచి విడి విడి దారిలో ఎక్కడో ఆగిపోయి ఉంటుందనే అంచనాకు వస్తాడు. వెంటనే రైలును ఆపేస్తాడు. ఈ విషయం గురించి పై అధికారులకు సమాచారం అందివ్వడమే కాకుండా మళ్లీ పరిస్థితిని చక్కదిద్దే వరకు రైలును ముందుకు కదలనివ్వడు.
Advertisement
వీటితో పాటు రైలు బోగీలలో పలు భద్రతా వ్యవస్థలు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా రైలు చివరి బోగీపై వెనుక వైపు మిణుకు మిణుకు మనే ఎర్ర బల్పు కచ్చితంగా అమర్చుతారట. చిమ్మ చీకటిలో కూడా ఈ కాంతి కనిపిస్తుందట. ఎర్ర బల్బు అలా మిణుకు మిణుకు మంటుంటే.. రైలు కదులుతోందని అర్థం. దీంతో ఇతర రైలు అప్రమత్తమై.. పరిస్థితి అనుగుణంగా తమ వేగంలో మార్పులు చేసుకుంటాయట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అప్పట్లో ఎన్టీఆర్ ఫుడ్ 24 ఇడ్లీలు, 30 బజ్జీలు.. ఇంకా మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఆదిపురుష్ ట్రైలర్ లో మనకు కనిపించిన 5 మైనస్ పాయింట్స్ ఇవేనా ?