Advertisement
టాలీవుడ్ ప్రేక్షకులు మరువలేని హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ అతను ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. 2001, 2002 సంవత్సరాల్లో ఉదయ్ కిరణ్ ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకొని ఎలా ఎదిగాడో అలాగే నేలకొరిగాడు. ఎక్కువ రోజులు టాలీవుడ్ లో ఇమడలేకపోయాడు అనే వ్యాఖ్యలు చాలానే వినిపించాయి. తొలుత అతను స్టార్ హీరో రేంజ్ కి వెళ్లి ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
Advertisement
చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస హిట్ అందుకొని 2014 లో ఆ**త్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రంలో అతనికి చెల్లిగా నటించిన శిరీష గుర్తుందా ? అప్పట్లో కొన్ని సినిమాలలో అక్క పాత్రల్లో, కొన్ని సినిమాల్లో చెల్లి పాత్రల్లో నటించింది శిరీష. ఇప్పుడు సీరియల్స్ లో చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ప్రసారమైన మౌనరాగం సీరియల్ లో ఆమె నటించారు. నీలవేణి పేరుతో తల్లి పాత్రలో కనిపిస్తున్న ఆమె ప్రేక్షకులను బాగానే అలరించారు.
Advertisement
ప్రస్తుతం మౌనరాగం సీరియల్ ముగిసిపోయింది. తొలుత ఈమె మోడలింగ్ చేస్తూ.. సినిమాల్లోకి వచ్చారు. ఇక ఆ తరువాత వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అతడే ఒక సైన్యం, పల్లకిలో పెళ్లి కూతురు లాంటి సినిమాల్లో నటించారు శిరీష. కానీ మనసంతా నువ్వే సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా తరువాత కొద్దిమేరకు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కెరీర్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
బైక్ పంచర్ల పేరుతో జరుగుతున్న ఈ మోసాల గురించి తెలుసా ?
పెళ్లి అయిన తరువాత ప్రియుడిని నమ్మి రూమ్ కి వెళ్తే ఏం జరిగిందంటే ?