Advertisement
లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు.
Advertisement
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర చేసిన జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది.
Read also: పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజీనావో ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?
Advertisement
ఈ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతూ.. కాస్త ఫన్నీగా, కాస్త సెంటిమెంట్ గా అన్ని యాంగిల్ యాక్షన్లు వర్కౌట్ అయ్యే పాత్ర. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఓ ఫేమస్ యాక్టర్ ను అనుకున్నారట. చిత్తూరు యాసలో మాట్లాడే మహేష్ విట్టాను ఈ పాత్రలో పెట్టాలని సుకుమార్ ప్రయత్నించారు. మహేష్ విట్టా ఈ పాత్ర కోసం ఆడిషన్స్ కు వెళ్లినట్టు సమాచారం. ఓ ఇంటర్వ్యూలో మహేష్ విట్టా మాట్లాడుతూ.. ” కేశవ పాత్ర కోసం నాతో పాటు ఎంతోమంది ఆడిషన్ కి వచ్చారు. ఆ సినిమాలో కొన్ని సీన్లని నాకు చెప్పారు.
పాత్ర నాకు నచ్చడంతో అంతా ఓకే అనుకున్నాం. కానీ చివరికి నన్ను పిలవకుండా వేరొక అబ్బాయిని తీసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. ఈ సినిమాకి రెండు సంవత్సరాల సమయం కేటాయించలేను అనుకొని ఆ స్థానంలో వేరే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. తెరపై కేశవ పాత్రను చూసి చాలా సంతోషం అనిపించింది” అని చెప్పుకొచ్చారు మహేష్ విట్టా. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఈ రెండవ పార్ట్ ని ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్.
Read also: కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న “స్వాతి” అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?