Advertisement
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుపాటి ముఖ్యపాత్ర పోషించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ హక్కులని కొన్నారు.
Advertisement
Read also: సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?
అందులో భాగంగా ఈ సినిమాలో ఎవరిని హీరోగా తీసుకోవాలని వంశీ ఆలోచిస్తున్నప్పుడు ఆయన నందమూరి నటసింహం బాలయ్య బాబు అయితే ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు అని భావించి బాలయ్య బాబుకి ఈ విషయం చెప్పారట. ఆయనకి ఈ సినిమా కథని కూడా చెప్పడంతో ఆయనకి కథ నచ్చింది. కానీ తనకంటే పవన్ కళ్యాణ్ కి అయితేనే ఈ కథ బాగుంటుందని బాలయ్య నిర్మాత సూర్యదేవరనాగ వంశీకి సజెస్ట్ చేశారట. ఇక ఈ కథ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లగానే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడు.
Advertisement
ఇక ఈ సినిమా కథ ప్రకారం మరో ముఖ్య పాత్ర కోసం డేనియల్ శేఖర్ గా ఎవరైతే బాగుంటారని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రానా అయితే ఈ క్యారెక్టర్ కి సరిపోతాడు అని అతడిని తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో రానాకి వైఫ్ గా సంయుక్త మీనన్ ని తీసుకున్నారు. ఈ విషయం అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పాల్గొన్న సందర్భంలో వీరిద్దరి మధ్య నడిచిన డిస్కషన్ లో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మంచి సినిమాగా చెప్పవచ్చు.
Read also: పెట్రోల్, వాటర్, పాల ట్యాంక్లు మాత్రమే ఎందుకు ఇలాంటి ఆకారం లో ఉంటాయి ? దీనికి కారణం ఏంటంటే ?