Advertisement
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 294 స్థానాలకు 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో 18% ఓట్లను దక్కించుకున్నారు. అయితే చిరంజీవి తిరుపతి , పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా.. తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాలలో ఇమడలేక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవిని చేపట్టారు.
Advertisement
Read also: సమంత మళ్ళీ ప్రేమలో పడిందా?
అయితే కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తంలో ఆఫర్ చేయడం వల్లే చిరంజీవి పార్టీని విలీనం చేశారనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి నటించిన తాజా చిత్రం “గాడ్ ఫాదర్” విడుదలై ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవికి అత్యంత సన్నిహితులు ఎన్ వి ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు చాలా అప్పులు మిగిలాయని.. వాటిని తీర్చడానికి చెన్నైలోని ప్రసాద్ లాబ్స్ పక్కన ఉన్న కృష్ణ గార్డెన్స్ ను చిరంజీవి అమ్మారని సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ అప్పులన్నీ తీర్చిన తర్వాతే తిరిగి సినిమాలలోకి వెళ్లారని స్పష్టం చేశారు.
Advertisement
తాజాగా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవిని పూరి జగన్నాథ్ ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. గాడ్ ఫాదర్ సినిమా పూర్తి పొలిటికల్ డ్రామా కావడంతో మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరని పూరి జగన్నాథ్ అడిగారు. దానికి చిరంజీవి తనకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే తనకి చాలా ఇష్టం అని.. ఆయన సింప్లిసిటీ, తన జీవితాన్ని దేశ శ్రేయస్సు కోసం అర్పించిన మహానుభావుడు అంటూ చెప్పుకొచ్చారు. మనం మహాత్మా గాంధీని ఎలా అయితే అనుకుంటామో అదే విధంగా అదే రోజున పుట్టిన లాల్ బహుదూర్ శాస్త్రి గారిని కూడా గొప్ప రాజకీయ నాయకుడుగా ఇష్టపడతారని తెలిపారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందని అన్నారు.
Read also: గరికపాటి వ్యాఖ్యలపై మొదటి సారి స్పందించిన చిరు ! అయన ఒక…. అంటూ !