Advertisement
నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరులో మెరుగైన చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆసుపత్రి యాజమాన్యాలు ఆయనకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ మరియు నారా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వారు నందమూరి తారకరత్న యొక్క చికిత్సకు అవుతున్న పూర్తి ఖర్చును భరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Advertisement
Advertisement
నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటు గురయ్యాడు కాబట్టి ఆయన వైద్య ఖర్చులను పూర్తిగా చంద్రబాబు నాయుడు పెట్టుకోవడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ విషయాన్ని నందమూరి తారకరత్న భార్యతో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారట. అయితే నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉన్న తారకరత్న వైద్య ఖర్చులను చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు సొంతంగా హాస్పిటల్ బిల్లులను చెల్లించడానికి ముందుకు రావడంతో ఆయనది ఎంత మంచి మనసు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఇంకా మెరుగైన వైద్యం కోసం విదేశాలకు పంపించే అవకాశం కూడా కనిపిస్తోందని తెలుస్తోంది..
also read: వెరైటీ స్టోరీ ! 30 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడి విచిత్ర ప్రేమకథ.. ! అసలు ఎలా కుదిరిందంటే ?