Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో కిందిస్థాయి నుంచి ఎంతో కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరు పొందారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపుగా ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1980లో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రస్తుతం కూడా సినిమాల్లో చేస్తూ ముందుకు వెళ్తున్నారు మెగాస్టార్. ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కో విధంగా నటిస్తూ ఎంతో కృషి చేసి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం కోసం కష్టపడ్డారని చెప్పవచ్చు.
Advertisement
ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు అనేక సినిమాలు చేశారు ఆయన. తెలుగు ఇండస్ట్రీ లోనే ఘరానా మొగుడు చిత్రంలో మెగాస్టార్ మరియు నగ్మా నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Advertisement
తనదైన శైలిలో డైలాగులు చెబుతూ పసందైన వినోదాన్ని పంచి మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఆయన నగ్మా తో నటించడమే కాకుండా ఆమె చెల్లెళ్లతో కూడా నటించి మెప్పించారు. మాస్టార్ మూవీలో రోషిని, ఠాగూర్ మూవీలో జ్యోతిక ఇద్దరు నగ్మా చెల్లెళ్లు కావడం మనందరికీ తెలిసిందే.
ఆయన సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎంత కష్ట పడ్డారో, ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిందే. అంత కష్టపడ్డారు కాబట్టే మంచి నటుడిగా పేరు పొందడమే కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో గౌరవమైన హోదాలో ఆయన ఉన్నారు. ఆయన సినిమాల్లోనే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధుగా ఉంటుంది.
Also Read: