Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో “టెంపర్” మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, బాద్ షా, రెండు సూపర్ హిట్ సాధించగా టెంపర్ తో హైట్రిక్ కొట్టారు. ఈ చిత్రం ఓపెనింగ్ డే రోజే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అప్పుడు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డులకు ఎక్కింది.
Advertisement
Advertisement
ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫామెన్స్, పూరి జగన్నాథ్ దర్శకత్వం, డైలాగ్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి. వాస్తవానికి టెంపర్ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ అప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా వక్కంతం వంశీ ఇచ్చిన కథను చాలా జాగ్రత్తగా తనకు నచ్చిన విధంగా మార్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వక్కంతం వంశీ ఈ కథతో రవితేజ హీరోగా “పవర్” అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడట.
షాడో సినిమా తర్వాత వక్కంతం వంశీ కథతో రవితేజ హీరోగా ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారని.. కానీ టెంపర్ కథ రవితేజకి నచ్చలేదని చెప్పారు. అలాగే మెహర్ రమేష్ తన దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కించాల్సిన రెండు సినిమాలు కూడా ఆగిపోయాయని.. స్క్రిప్ట్ విషయంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమాకి తన టైటిల్ అయిన “పవర్” ని ఫిక్స్ చేశారని మెహర్ రమేష్ వెల్లడించారు.
Read also: భర్త… భార్యకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి