Advertisement
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు బాలయ్య. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న బ్లాక్ బ్లస్టర్ మూవీ లెజెండ్ ఒకటి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలోరాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
Advertisement
మ్యూజిక్ మాంత్రికుడు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చారు. 2014లో విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలి రోజు మొదటి ఆట నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా ప్రతినాయకుడిగా జితేంద్ర పాత్రలో జగపతిబాబు నటన అదరగొట్టాడనే చెప్పాలి. ఈ మూవీతో జగపతి బాబు జాతకమే మారిపోయింది.
Advertisement
హీరోగా కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలోనే.. లెజండ్ మూవీతో విలన్ గా జగపతి బాబు కాదు.. తొలుత సీనియర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ని సంప్రదించారట. కానీ విలన్ పాత్రలు తాను చేయడం ఇష్టం లేని రాజశేఖర్ ని సున్నితంగా లెజెండ్ మూవీని రిజెక్ట్ చేశాడట. ఒకవేళ రాజశేఖర్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మాత్రం.. ఆయన కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హీరో రాజశేఖర్ సినిమాలను తగ్గించాడు. కారణం మాత్రం తెలియడం లేదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కళ్యాణ్ రామ్ భార్య గురించి మీకు ఈ రహస్యాలు.. వామ్మో ఆమె ఇలా చేసిందా..?
చిరంజీవి కూతురు ఉదయ్ కిరణ్ గురించి ఏం చెప్పారు..? ఉదయ్ తో సుస్మిత నిశ్చితార్థానికి కారణం ఏమిటి..?
SAMAJAVARAGAMANA REVIEW: సామజవరగమన స్టోరీ, రివ్యూ & రేటింగ్..!