Advertisement
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం సార్. తమిళంలో వాతి పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో సాయికుమార్, సముద్రఖని, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17వ విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. విద్య వ్యాపారంగా ఎలా మారింది.. చదువుని అడ్డుపెట్టుకొని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ కొందరు ఎలా కోట్లు సంపాదిస్తున్నారనే పలు అంశాలని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు.
Advertisement
Read also: ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్
చాలా ఎళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా కెరీర్ లో తనదైన గట్టి విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయాడు వెంకీ. అయితే ఇప్పుడు తెలుగు హీరోలను పక్కనపెట్టి తమిళ్ లో తొలి డబ్ల్యూ గా సార్ సినిమా తీసి అటు తమిల్ తో పాటు తెలుగులోనూ సాలిడ్ హీట్ కొట్టేశాడు. అయితే మొదట ఈ సినిమా కథని తెలుగు హీరో అయిన న్యాచురల్ స్టార్ నానితో తీయాలని వెంకీ అనుకున్నాడు. అయితే ఈ కథను నాని రిజెక్ట్ చేశారట. నాని ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణం కథలో కొన్ని పాయింట్స్ నచ్చకపోవడమే అని తెలుస్తుంది. అవి మార్చి గనుక తీసుకొస్తే వెంకీ తో ఈ సినిమా చేయడానికి నాని సిద్ధం అని చెప్పారట.
Advertisement
కానీ వెంకీ అందుకు ఒప్పుకోకపోవడంతో నాని ఈ చిత్రంలో నటించలేకపోయాడు. ఈ విషయం తెలిసిన నాని అభిమానులంతా ఫీల్ అవుతున్నారు. అయితే ధనుష్ కి ఈ కథని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. కథ విన్నాక ధనుష్ చప్పట్లు కొట్టి.. కాల్ షీట్స్ ఎప్పుడు కావాలని అడగడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అయితే వెంకీ అట్లూరి ఇప్పటికే తెలుగులో చాలా ఏళ్లుగా ఒక సరైన హిట్టు కోసం కష్టపడుతున్నారు. నటుడిగా, డైలాగ్ రైటర్ గా, రైటర్ గా, దర్శకుడిగా దాదాపుగా 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు వెంకీ. ఇప్పుడు తొలి డెబ్యూగా సర్ సినిమా తీసి అటు తమిళ్ తో పాటు తెలుగులోనూ సాలిడ్ హిట్ కొట్టేశారు.
Read also: జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?