Advertisement
కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సంస్థ “హోంబలే”. ఈ సంస్థ తాజాగా నిర్మించిన మరో పాన్ ఇండియా చిత్రం “కాంతారా”. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంతారా సినిమా టాక్ వినిపిస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించారు. అలాగే దర్శకత్వం కూడా ఆయనే వహించారు. కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని భూతకోల నృత్య కళాకారులను తెరపై చూపించిన తీరు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Advertisement
Advertisement
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఫిదా అవని ప్రేక్షకులు అంటూ ఉండరు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కధ, సాంకేతిక నిపుణులు, నటీనటులు.. అంతా పొందిగ్గా కుదిరితే, వాళ్లంతా తమ ప్రతిభని నూటికి నూరుపాళ్ళు ఆవిష్కరిస్తే.. ఎలాంటి సినిమాలు వస్తాయో చెప్పడానికి ఈ చిత్రం అతిపెద్ద ఉదాహరణ. అయితే ఈ చిత్రంలో అమ్మ పాత్ర పరీక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. తన కొడుకు శ్రేయస్సును కోరుకునే చిన్న ప్రపంచంలో జీవించే మహిళగా కమల కనిపించింది. అయితే ఈ పాత్రలో నటించింది ఎవరో తెలుసా..? ఆమే మానసి సుధీర్.
కరోనా లాక్ డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు మానసి సుధీర్. ఈమె ఇటీవల సినిమాలలో తల్లి పాత్రలలో ఎక్కువగా హైలైట్ అవుతుండగా.. ఈ సినిమాలో కూడా తల్లి పాత్రలో చాలా అందంగా కనిపిస్తోంది. టీచర్ అయిన మానసి సుధీర్ లాక్ డౌన్ సమయంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలకు ఇష్టమైన వ్యక్తిగా మారింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో మానసి సుధీర్ కు రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
Read also: మహిళలలో ఈ గుణాలుంటే.. పురుషులు వారికి ఫిదా అవుతారట !