Advertisement
ఇండస్ట్రీలో డేటింగ్ సర్వసాధారణం. ఇక్కడ పెద్దగా డేటింగ్ రూమర్స్ వినిపించవు కానీ నార్త్ లో మాత్రం ఎక్కువగా వీటి గురించి వింటూ ఉంటాం. హీరో హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నట్లు లేకపోతే హీరో హీరోయిన్లకు సంబంధించి డేటింగ్లకు సంబంధించి వివిధ రకాల రూమర్స్ వింటూ ఉంటాం. తాజాగా ఒక తెలుగు హీరోయిన్ కూడా ఓ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా మాజీ సీఎం మనవడితో. ఆ హీరోయిన్ ఎవరా అని మీరు అనుకుంటున్నారా..? అతను ఎవరో కాదు మాజీ విశ్వసుందరి మానుషీ చిల్లర్. తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు.
Advertisement
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తెలుగులో సోషల్ మీడియాలో మాత్రం ఈ హిందీ భామకు క్రేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఈమె లేటెస్ట్ ఫోటోస్ ని వదులుతూ అందరి మతి పోగొడుతోంది. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీర్ కూడా బాలీవుడ్ యాక్టర్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముఖ్య మంత్రి మరో మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ పీక లోతు ప్రేమలో మునిగిపోయింది.
Advertisement
Also read:
ఇప్పుడు మానుషీ చిల్లర సైతం వీర్ తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ రావడంతో జాన్వి మానుషీ తోడుకోడళ్ళు అవుతున్నారని పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా జాన్వి తన ప్రియుడు శిఖర్ పహారియాతో పాటు స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రేమ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా లేకపోతే నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నారా అనేది తెలియాలంటే వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!