Advertisement
సినీ ఇండస్ట్రీలో నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నాగర్జున భార్యగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. నాగార్జునతో శివ, నిర్ణయం వంటి చిత్రాలలో కలిసి నటించింది. 1987లో నాగార్జున హీరోగా వచ్చిన కిరాయి దాదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అమల. వివాహానికి ముందు సుమారుగా 50 చిత్రాలలో తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలలో నటించిన ఈమె పెళ్లి తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో తల్లి పాత్ర పోషించింది.
Advertisement
Read also: ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!
Advertisement
ఇకపోతే ఈమెకు మలయాళం సినిమాల ద్వారా నంది అవార్డు కూడా లభించింది. ఇక 1992లో నాగార్జునను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం తన కుటుంబాన్ని చూసుకుంటూ, అక్కినేని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వస్తుంది. అంతేకాదు మూగజీవాల మీద ప్రేమతో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అయితే అమలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆమెకు కొన్ని కోట్ల ఆస్తి ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆమె మాత్రం సింపుల్ గా ఒక నల్లపూస దండతో మాత్రమే కనిపిస్తుంది. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అమల ఒంటిమీద తులం బంగారం కూడా కనిపించదు.
దీనికి కారణం ఆమెకి బంగారం ఇష్టం లేక కాదు.. ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉందట. ఒకవేళ ఆభరణాలు ఏవైనా వేసుకుంటే రాషెస్ వచ్చేస్తాయట. వెంటనే చర్మం ఎర్రగా మారిపోయి ఘోరంగా కనిపిస్తుందట. అందుకే ఆమె బంగారం నగలు ధరించదు అంటున్నారు కొందరు. ఆమెకు ఉన్న ఈ ఆరోగ్య సమస్య గురించి ఇన్నాళ్లు ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు.
Read also: ఆస్కార్ అవార్డు 80 కోట్లకి కొన్నారు అనే కామెంట్ కి దానయ్య దిమ్మ తిరిగే రిప్లై ! ఏమన్నారంటే ?