Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు. ఈ ఆచారం ఇంచుమించు దేశమంతటా ఉంటుంది. ఇలా గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే? దీని వెనకాల ఒక రహస్యం ఉంది. దేవతామూర్తులలో స్త్రీ స్వరూపములన్నీ అమ్మవారి రూపములే. లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమూర్తుల శక్తులు. వారిలో మిగిలిన వారి కన్నా పరమేశ్వరుని ఇల్లాలైన గౌరమ్మనే పెళ్లికూతురు చేత పూజింపచేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది.
Advertisement
Read also: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆమె కాళ్లు పట్టుకున్నాడట.. ఏం జరిగిందంటే?
పరమేశ్వరునికి ఇల్లాలుగా ఉండడం చాలా కష్టం. ఆయన స్మశానంలో నివసించేవాడు, చేతిలో కపాలాన్ని ధరిస్తాడు, నిత్యం తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. ఆయన మనసుని గెలుచుకొని, సమస్త సృష్టి సంక్షేమం కోసం సంసారం లోకి దించడం సామాన్య విషయమా? వివాహానికి ముందు, తర్వాత ఆడపిల్లల అనుభవం చూడండి. పెళ్లంటే అమ్మాయిలకు అంతకుముందు అసలు పరిచయం లేని ఒక కొత్త వ్యక్తితో బంధం ముడిపడి తన జీవితమంతా అతనితోనే సహవాసం చేయాలి. చాలామంది పెళ్లంటే ఎన్నో కలలు కంటారు. కానీ తను కలగన్న రాకుమారుడు జోడిగా రాకపోవచ్చు, తాను కోరుకున్న సంపన్నుడు కాకపోవచ్చు, కానీ తన జీవితం అతనితోనే ముడి పడిపోతుంది. నూతన వధువు అంటే స్వయంగా ఆ గౌరము. ఎప్పుడూ ఆయన మనసుకి ప్రీతిగా ప్రవర్తించాలి.
Advertisement
ఏ చెరుకువిల్లు పట్టుకొని బాణాలు వేసి కూడా ఆ మన్మధుడు సాధించలేకపోయాడో, ఆ చెరుకువిల్లు తాను స్వయంగా ధరించిన లలిత ఏమీ మాట్లాడకుండా కూర్చున్న శివుణ్ణి సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. తన బిడ్డలకి తండ్రిని చేసింది. అలాగే ఇల్లాలు కాబోతున్న యువతి తాను గౌరమ్మ ఎలా పరమేశ్వరుని మనసు గెలిచిందో అదే విధంగా భర్త మనసుని గెలవాలి. ఆయనకు ప్రీతిని కలిగించే విధంగా ప్రవర్తించాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా భర్తకు విశ్రాంతి స్థానముగా నిలవాలి. కనుక ఆమెకు అలాంటి శక్తి రావాలని ఆమె చేత సన్నికల్లు తొక్కిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు అందుకే పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు.
Reas also: వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!