Advertisement
స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగునాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. నేడు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే అభిమానులు కోకోల్లలు. అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు. శ్రీదేవి సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు. మూడు తరాల హీరోల సరసన హీరోయిన్ గా నటించిన అందం శ్రీదేవి సొంతం.
Advertisement
Read also: తమ్ముడు సినిమాలో “లవ్ లీ” గా నటించిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?
ఇక శ్రీదేవి – కమల్ హాసన్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పలు సినిమాలలో వీరి రొమాన్స్ కు వంద మార్కులు పడ్డాయి. ఈ కాంబినేషన్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అలా వీరి జంటను చూసిన అభిమానులు నిజజీవితంలోనూ వేరు ఒకటైతే బాగుండని భావించేవారు. అంతేకాక శ్రీదేవి కుటుంబంతో కమలహాసన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారట. అలా వారి కుటుంబంతో సన్నిహితం ఉండడం వల్ల స్వయంగా శ్రీదేవి తల్లి కమల్ హాసన్ ను తన కూతురిని వివాహం చేసుకోవాలని కోరిందట. కానీ ఆమె అభ్యర్థనను కమల్ హాసన్ సున్నితంగా తిరస్కరించారట.
Advertisement
తాను శ్రీదేవిని తోబుట్టువులా భావించే వాడినని.. అందుకే ఆమెని వివాహం చేసుకోలేనని ఆమె తల్లితో చెప్పేశారట. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. శ్రీదేవి కి నివాళులు అర్పించే ఓ కార్యక్రమం సందర్భంగా శ్రీదేవి 28 అవతారాలు అని రాసిన ఓ నోట్ లో కమల్ హాసన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వారు ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే వారమని.. శ్రీదేవి చనిపోయే వరకు తనని సార్ అని సంబోధించేదని కమల్ హాసన్ వెల్లడించారు. ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కించిన పలు చిత్రాలు బుల్లితెరపై ప్రసారం అయితే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.
Read also: బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?