Advertisement
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ – నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. విరెన్ మర్చంట్ – శైల దంపతులకు మారితే రాధిక మర్చంట్ తో అనంత్ అంబానికి ఇటీవల ఘనంగా నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ లోని శ్రీనాథ్ జి ఆలయంలో ఈ వేడుక జరిగింది. నిశ్చితార్థం అనంతరం ముంబైలోని అంబానీ నివాసం ఆంటీలియాలో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు ఆటపాటలతో అలరించారు.
Advertisement
Read also: అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?
గుజరాతి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో అనంత్ అంబానీ భారీ కాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి నాజూగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు బరువు తగ్గిన అనంత్.. మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై అనంత్ తల్లి నీతా అంబానీ స్పందించారు.
Advertisement
“గతంలో 200 కిలోల వరకు బరువు ఉన్న అనంత్ 100 కిలోల వరకు బరువు తగ్గి చాలామందికి రోల్ మోడల్ గా నిలిచాడు. నా కుమారుడు తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు. వీటి దుష్ప్రభావాల కారణంగానే అనంత్ మళ్లీ బరువు పెరిగాడు. అనంత్ ప్రతిరోజూ 5 నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగే ఊబకాయంతో పోరాడుతున్న వాళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటారు. దయచేసి అలాంటి వాటిని చిన్న చూపు చూడకండి” అని స్ఫూర్తి నింపారు నీతా అంబానీ.
Read also: గుడిలో రజనీకాంత్.. బిచ్చగాడు అనుకొని మహిళ రూ.10 దానం! అసలు ట్విస్ట్ ఏంటంటే..?