Advertisement
మనదేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం ఉంది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతస్తులకు ప్రాథమిక హక్కులు కల్పించ బడ్డాయి. ముఖ్యంగా మన ఇండియాలో హిందువులు, ముస్లింలు అలాగే క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అయితే ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే 786 సంఖ్య గురించి అందరికీ తెలిసిందే. ముస్లింలు తమ దైవంగా భావించి అల్లాను దయగలవాడు అని కొలుస్తూ వుంటారు. ఈ నమ్మకానికి ప్రతీక మనం చెప్పుకుంటున్న ఈ 786 సంఖ్య.
Advertisement
అవును అబ్జాద్ అని పిలవబడే పురాతన అరబిక్ సంఖ్యా శాస్త్రం ప్రకారం…. ఈ సంఖ్య ఉద్భవించిందని తార్కికులు చెబుతున్నారు. అబ్జాద్… సంఖ్యాశాస్త్రం ప్రకారం… 5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ భాషలో మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి అని… ఆ భాషలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక నెంబరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేయబడిన నెంబర్స్ ప్రకారం 786 పుట్టిందని వారి నమ్మకం. వారి ఖురాన్ ప్రారంభంలో బిస్మిల్లాహ్ ఇర్ రహమాన్ ఇర్ రహీమ్ అని ఉంటుంది. ఈ పవిత్ర వ్యాఖ్య వ్రాయడానికి ఉపయోగించే అక్షరాల విలువలను కలిపితే ఈ 786 సంఖ్య వస్తుంది.
Advertisement
ఇంతటి గొప్ప పవిత్రమైన సంఖ్యకు ప్రపంచ దేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏసియా లోనే మరింత ఎక్కువ ప్రాధాన్యత. ఈ సంఖ్య సీరియల్ అంటే ఉన్నా డబ్బు నోట్లకు కూడా మంచి గిరాకీ ఉంది అంటే అర్థం చేసుకోండి మరి. అప్పుడప్పుడు ఈ సంఖ్య ఉన్న నోట్ల కోసం కొంతమంది భారీ మొత్తంలో వెచ్చించి మరీ సొంతం చేసుకుంటారు.
Also Read:
బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?