Advertisement
మనం మార్కెట్లో అనేక రకాల దుస్తులను చూస్తూ ఉంటాము. మనం ధరించేందుకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో జీన్స్ ప్యాంట్లు ఒకటి. ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ ధరిస్తున్నది జీన్స్ ప్యాంట్. ఎంతో స్టైలిష్ గా, ట్రెండీగా కనిపించాలంటే జీన్స్ ధరించాల్సిందే. గత కొన్ని దశాబ్దాలుగా జీన్స్ పాంట్లు ప్యాషన్ కు కేంద్రంగా మారాయి. యువతలో జీన్స్ ప్యాంట్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఈ జీన్స్ పాంట్స్ లో మనం రకరకాల మోడల్స్ చూస్తూనే ఉంటాం.
Advertisement
Read also: రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?
కానీ అన్ని జీన్స్ ప్యాంట్లను మీరు సరిగ్గా గమనించి చూసినట్లయితే వాటికి ఉండే రెండు జేబుల పైన చిన్న చిన్న పాకెట్లు ఉంటాయి. అయితే ఆ పాకెట్లను ఎందుకు ఏర్పాటు చేశారో మీకు తెలుసా..? ఈ కాలంలో అయితే మనం ఈ పాకెట్లలో కాయిన్స్ లేదా తాళం చెవులు, టికెట్లు వంటి వాటిని ఉంచుకుంటాం. కానీ క్రీ. శ 1800 కాలంలో పాశ్యత దేశాల్లో విరివిగా చైనా గడియారాలు దొరుకుతుండేవి. అప్పటికి చేతి గడియారాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో అందరూ వీటినే వాడేవారు. ఆ కాలంలో అదొక ఫ్యాషన్. అలాగే ఆ కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే గుర్రాల పైనే వెళ్లేవారు.
Advertisement
అలా గుర్రపు స్వారీ సమయంలో ఈ వాచీని ఎక్కడ పెట్టాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉండేవారు. వారి కోసమే ఇలాంటి చిన్న జేబును ఒకటి ఏర్పాటు చేయాలని భావించారు జీన్స్ రూపకర్తలు. ఇప్పుడు ఆ వాచీలు కనుమరుగైపోయినా.. ఆ జేబులు మాత్రం మిగిలిపోయాయి. వీటితో మనకు అవసరం లేకపోయినా అలానే కొనసాగిస్తున్నారు. ఇది జీన్స్ ప్యాంట్లకు చిన్న చిన్న పాకెట్లను ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న అసలు కారణం. అందుకనే ఈ పాకెట్లను వాచ్ పాకెట్లు అని కూడా పిలుస్తారు.
Read also: ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా 7 దేవి శ్రీ ప్రసాద్ పాటలు!