Advertisement
రామ్ చరణ్-ఉపాసనల వివాహానికి పదేళ్లు. జూన్ 14, 2012 లో వీరి పెళ్లి అతిరథ మహారధుల మధ్య ఘనంగా జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదితో చరణ్, ఉపాసన వివాహ బంధానికి పదెళ్ళు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ యానివర్సరీని ఘనంగా ప్లాన్ చేస్తుంది ఈ జంట.
Advertisement
టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ భార్యగా, మెగాస్టార్ కోడలుగా, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ను చరణ్ కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట.
Advertisement
రామ్ చరణ్-ఆశ్రితలకు వివాహం చేయాలని చిరంజీవి, వెంకటేష్ మధ్య మాటలు జరిగాయట. దాదాపు ఈ సంబంధం ఖాయం అయ్యిందట. ఇక రామ్ చరణ్ అభిప్రాయం చిరంజీవి అడగగా నో చెప్పారట. అలాగే తాను కామినేని ఉపాసనను ప్రేమిస్తున్నట్లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడట. ఉపాసనతో, రామ్ చరణ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్న చిరంజీవి చేసేది లేక వెంకటేష్ కుటుంబంతో సంబంధం క్యాన్సిల్ చేశాడట. ఇదే విషయాన్ని వెంకటేష్ తో చెప్పాడట. ఇక 2012 జూన్ 14 న రాంచరణ్, ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మరోవైపు ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించారు. కోరుకున్న వాడికి ఇచ్చి వెంకటేష్ ఆశ్రిత వివాహం చేశారు.
భర్తతో పాటు విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇక రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే 10వ వివాహం వార్షికోత్సవం జరుపుకున్నారు. సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు ఈ జంట. అక్కడే వన్ వీక్ ఏకాంతంగా గడిపి వచ్చారు. ఇద్దరు తమ వృత్తుల్లో చాలా బిజీగా ఉంటారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఆ సంస్థ చారిటీ కార్యక్రమాలతోపాటు ది పాజిటివ్ అనే మ్యాగజైన్ నడుపుతున్నారు. ఇక రామ్ చరణ్ స్టార్ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు.
Read Also : Shakini Dakini Movie Review :శాకినీ డాకిని మూవీ రివ్యూ