Advertisement
సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు మార్కెట్లో రకరకాల పండ్లను చూస్తూ ఉంటాం.వాటిని కొనుగోలు కూడా చేస్తాం.. ఒక పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఇక యాపిల్ తింటే మాత్రం డాక్టర్ అవసరం లేదంటారు. అంతటి పోషకాలు ఉన్న పండ్లు మనం కొనుగోలు చేసినప్పుడు వాటిపై స్టిక్కర్లు నెంబర్ తో అంటించి ఉంటాయి. నెంబర్స్ ఎందుకు ఇచ్చారో ఇప్పటివరకు కూడా మనకు తెలియదు.. వాటి వెనక చాలా విషయం ఉంది.. అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం..?
Advertisement
ప్రస్తుతకాలంలో ఇతర ఆహార పదార్థాల కంటే పండ్లను మాత్రమే తిని జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఫ్రూట్స్ క్వాలిటీ విషయంలో చాలా మందికి అవగాహన లేదు. మనం మార్కెట్లోకి గాని, మాల్స్ లోకి గాని వెళ్ళినప్పుడు పండ్లపై స్టిక్కర్ అంటించి ఉంటుంది. వాటిపై నెంబర్ కూడా ఉంటుంది. ఆ స్టిక్కర్ పై ఉన్న అంకెలు దేనికి సంకేతాలో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పండ్లను కొన్నామా.. తిన్నామా అన్నది మాత్రమే మనకు తెలుసు. పండ్లపై ఉన్న స్టిక్కర్ పై నాలుగు అంకెల సిరీస్ ఉండి మూడు లేదా నాలుగు అంకెతో ప్రారంభమైతే వాటిని కృత్రిమ రసాయనాలు సహజసిద్ధ ఎరువులు వాడి పండించారని అర్థం.
Advertisement
అలాగే పళ్ళ పై ఉన్న స్టిక్కర్ ఐదంకెల సీరియస్ ఉండి ఆ నెంబర్ 9 తో ప్రారంభం అయితే ఆ పంటను పూర్తిగా సేంద్రియ ఎరువులు ఉపయోగించి అత్యంత సహజసిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇది మన శరీరానికి ఎలాంటి హానీ కలిగించదు. పూర్తిగా సురక్షితమైనవి. మంచి క్వాలిటీ అని చెప్పవచ్చు. పళ్లపై స్టిక్కర్ల మీద ఐదంకెల సిరీస్ ఉండి అది ఎనిమిది తో మొదలైతే వాటిని జన్యుమార్పిడి తో పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్రమాదకరం కూడా. అనారోగ్యం బారిన పడేస్తాయి. ఇక నుంచి మీరు పళ్ళు కొనేటప్పుడు ఓసారి గమనించి తీసుకోండి.