Advertisement
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొనిదెల నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 2010 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రేమ.. కొన్నాళ్లు మాత్రమే బాగుంటుందని.. లవ్ స్టోరీ ని డిఫరెంట్ గా చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్ భాస్కర్. కానీ అప్పట్లో ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా అంతగా అడలేదు. అంతేకాకుండా ఈ సినిమాతో నాగబాబు తీవ్ర నష్టాల పాలయ్యారు.
Advertisement
Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?
Advertisement
అయితే ఈ సినిమా ప్రజెంట్ జనరేషన్ కి మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆరెంజ్ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేస్తూ రెండు రోజులు ( మార్చ్ 25, 26) న స్పెషల్ షోస్ ఏర్పాటు చేశారు. అయితే మొదటిసారి విడుదలైనప్పుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాతను ఆర్థికంగా నష్టపరిచిన ఈ మూవీ.. ఆశ్చర్యకరంగా ఇప్పుడు మాత్రం క్రౌడ్ – పుల్లర్ గా మారింది. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ అయిన చిత్రాల విషయంలో ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేంటంటే.. ఈ సినిమాకి ఆరెంజ్ అనే టైటిల్ అని ఎందుకు ఖరారు చేశారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ఆరెంజ్ అనే టైటిల్ ని రిప్రజెంట్ చేస్తూ మూవీ మొదలైనప్పటినుండి ముగిసే వరకు రామ్ చరణ్ చేతికి ఆరంజ్ కలర్ వాచ్ ఉంటుంది. అలాగే ఆరెంజ్ కలర్ టి షర్ట్స్, మూవీ ఎండింగ్ లో జెనీలియా పై ఆరెంజ్ కలర్ స్ప్రే చల్లాడం.. ఇలా చాలా రకాలుగా మూవీలో ఆరెంజ్ కలర్ ని రిప్రెజెంట్ చేశారు. కానీ ఈ మూవీకి ఆరెంజ్ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారో మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ గారికే తెలియాలి. మీలో ఎవరికైనా ఆరెంజ్ మూవీ టైటిల్ మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి.
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?