Advertisement
సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్ లో కింది భాగంలో గ్రీన్,రెడ్,బ్లూ మరియు బ్లాక్ కలర్ లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది ఈ బాక్స్ లకు అర్థం చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కిందిభాగంలో ఉంటే దాని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం. కింది భాగంలో బ్లూ కలర్ లో ఉంటే నేచురల్ మరియు మెడిసిన్ గా తయారైందని అర్థం.
Advertisement
అలాగే పేస్ట్ కిందిభాగంలో రెడ్ కలర్ ఉంటే న్యాచురల్ కెమికల్ కాంపోజిషన్ కలిపి తయారు చేశారని అర్థం. అలాగే బ్లాక్ కలర్ ఉంటే మొత్తం కెమికల్స్ తోనే తయారు చేశారని అర్థం చేసుకోవాలని చాలామంది చెబుతుంటారు.కానీ ఇదంతా నిజం కాదు. అసలు ఈ కలర్ బాక్స్ లకు ఎలాంటి అర్థం కూడా లేదు. సాధారణంగా మనం ఒక కంపెనీకి చెందిన పేస్టులను తీసుకున్నప్పుడు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ చదివితే అన్ని పేస్టు లపై ఒకే రకమైన ఇంగ్రెడీయంట్స్ పేర్లు ఉంటాయి.
Advertisement
కాబట్టి ఆ కలర్ అనేది వాటిని తయారీని చూపించదు అని అర్థం చేసుకోవాలి. మరి ఆ కలర్ బాక్స్ లు ఎందుకు ఉంటాయి అంటే, పేస్ట్ ని ప్యాక్ చేసేటప్పుడు అవి సెన్సార్స్ ఉన్న మిషన్స్ నుంచి రోల్ అవుతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఆ లైట్లు ఉన్న సెన్సార్ ఏ పేస్టు కింది భాగంలో ఉన్న కలర్ బాక్స్ ని ఫీల్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుందో ఆ కలర్స్ ను ఈ సెన్సార్లు డిటెక్ట్ చేయడం కోసం వాడతారట.
Also Read:
తమకంటే “వయసు”లో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న 5 టీమిండియా క్రికెటర్స్…!
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?