Advertisement
మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కింది భాగంలో హోల్స్ ఉండటం మనం చూసే ఉంటాం. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే గాలి అనేది తేలికగా ఆడటానికి, సిలిండర్ కిందిభాగంలో హిట్ జనరేట్ కాకుండా ఎయిర్ అటూ ఇటూ కదలాడుతూ సిలిండర్ కింద టెంపరేచర్ మెయింటెయిన్ అవుతుంది. అలాగే సిలిండర్ కింద వాటర్ ఉంటే అది తొందరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఈ హోల్స్ ఉండటం వల్ల గాలి అందులో నుంచి వెళ్లి ఆ వాటర్ ను ఆవిరి చేస్తుంది. దీని వల్ల సిలిండర్ తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్ మనం తీసుకున్నప్పుడు సిలిండర్ బరువు గా ఉందా సీల్ సరిగ్గా ఉందా అనేది మాత్రమే చూస్తాం.
Advertisement
Advertisement
కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సిలిండర్ పై ఉన్న టెస్టింగ్ డ్యూ డేట్ దీన్ని ఎవరూ కూడా గమనించారు. సిలిండర్ కు టెస్టింగ్ డేట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి ఏ సిలిండర్ కైనా కూడా టెస్టింగ్ డేటు అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్పైరి డేట్ కి మరియు డ్యూ డేట్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటే ఈ డేట్ తర్వాత సిలిండర్ పని చేయదు అని అర్థం. అదే టెస్టింగ్ డ్యూ డేట్ అంటే ఆ డేట్ కి తప్పకుండా టెస్టింగ్ కి పంపియ్యాలి. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయితే సిలిండరు ఇక పని చేయదు అని అర్థం. ఈ డేట్ ని ఎలా చెక్ చేయాలి అంటే.. సిలిండర్ పై భాగంలో ఒక కోడ్ రాసి ఉంటుంది.
ఈ కోడ్ లో ఏ బి సి డి తో పాటుగా నెంబరింగ్ ఉంటుంది. ఇందులో ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు, డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం. దీని తర్వాత రెండు సంఖ్యలు ఉంటాయి. ఇది సంవత్సరానికి తెలియజేస్తుంది. ఉదాహరణకు అందులో డి 22 22 అని ఉందంటే ఈ సిలిండర్ ని తప్పనిసరిగా 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో టెస్టింగ్ తీసుకెళ్లాలి. ఆ టెస్టింగ్ లో కనుక సిలిండర్ ఫెయిల్ అయితే దాన్ని పక్కన పెట్టేయ్యాలి.