Advertisement
ఎలివేటర్లు ప్రస్తుత సమాజంలో మానవుడు ఎక్కువగా ఉపయోగించే పరికరాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇవి మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అలాగే టైం కూడా సేవ్ చేస్తాయి. అయితే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ ఎలివేటర్లు అనేవి చాలా ముఖ్యం గా మారాయి. ఇవి దాదాపు 15 అంతస్తుల నుంచి 20అంతస్తుల వరకు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ ఇలాంటి ఎలివేటర్ లలో అద్దాలు కూడా ఉంటాయి.మరి ఆ అద్దాలు ఎందుకు పెట్టారు.దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం..?
Advertisement
అయితే ఎలివేటర్లు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి అని చాలామంది ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇంజనీరింగ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించారు. దీంతో ఎలివేటర్ డిజైన్ బృందం ఎంతో భిన్నంగా ఎలివేటర్ లో అద్దాలను అమర్చడం మొదలు పెట్టింది. కొంతమంది ఎలివేటర్ లో ప్రయాణం చేసేటప్పుడు అసురక్షితంగా భావిస్తారు. భయపడతారు కూడా. దీన్ని చాలా మంది అనుభవించే ఉంటారు. ఎందుకంటే మన పక్కన ఉన్న వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి. ఈ సమయంలో అద్దాలు ఉండడం వల్ల లిఫ్ట్ లో ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ మనకు కనబడతాయి.
Advertisement
దీనిద్వారా సంభావ్య దాడులు, దోపిడీ జరగకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వీల్ చైర్ లో ప్రయాణించే వ్యక్తులు ఈ అద్దాల ద్వారా ఎలివేటర్ లలోకి ఈజీగా ప్రయాణించడం మరియు నిష్క్రమించడం సులభంగా ఉంటుందని జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ తెలిసింది.అయితే చాలామంది ఎలివేటరులో ప్రయాణించేటప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి ఆందోళన నుండి ఈ అద్దాలు మిమ్మల్ని రక్షిస్తాయి.అలాగే ఎలివేటర్లు మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ అద్దం ఉండడం వల్ల అందులో ఎక్కువ స్థలం ఉన్నట్లు రద్దీ తక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీనివల్ల కూడా మన భయాందోళన తొలగిపోతుంది.
Also Read:
పెళ్లయిన తర్వాత అమ్మాయిలు లావు ఎందుకు అవుతారు..?
ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా..?