Advertisement
చాలా మందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. న్యూస్ పేపర్ లో మనం సరిగ్గా గమనించినట్లైతే చదివే ప్రతి న్యూస్ పేపర్ కి కింది లైన్ లో రంగు చుక్కలు లేదా అదే రంగులో ఉండే వేరే వేరే సింబల్స్ ని మీరెప్పుడైనా గమనించారా. అయితే వాటిని చూసి కూడా మీరు పెద్దగా పట్టించుకోని ఉన్నారు. అసలు ఆ నాలుగు చుక్కలు న్యూస్ పేపర్ మీద ఎందుకు ప్రింట్ అయి ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సాధారణంగా ప్రింటర్ల లో ఏవైనా పేజీలు ప్రింట్ తీస్తే ఆ ప్రింటర్ ఆ పేజీలో సైజుకి అనుగుణంగా అక్షరాలను ఒక స్టైల్లో క్రమబద్ధమైన కొలతతో ప్రింట్ చేసి మనకిస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి : ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!
అలా ఎందుకిస్తుందంటే దాని అలైన్ మెంట్ అమరిక అలా ఉంటుంది. అక్షరాలు కానీ, ఫోటోలు కానీ బ్లర్ గా రాకుండా ఉండడం కోసమే ప్రింటర్లో ప్రింట్ అయ్యే ముందే అలా అలైన్మెంట్ చేసి ఉంటుంది. అందుకే మనం ఇచ్చే ప్రింట్స్ కానీ, ఫోటోలు కానీ క్రమపద్ధతిలో వస్తాయి. సరిగ్గా ఇదే సూత్రం న్యూస్ పేపర్ పెయింటింగ్ కి కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైనా కలర్ పేజీలో టెక్స్ట్ లేదా ఫోటోను అలైన్మెంట్ ప్రకారం ప్రింటింగ్ చేయాలంటే అందుకు పైన చెప్పిన ఈ నాలుగు చుక్కలు ఉపయోగపడతాయి. నిజానికి ప్రతి న్యూస్ పేపర్ లో ఉండే ఆ నాలుగు చుక్కలు నాలుగు కలర్స్ లో ఉంటాయి. అవే CMYK. C అంటే సియాన్ బ్లూ, M అంటే మెజెంటా పింక్, Y అంటే ఎల్లో, K అంటే బ్లాక్ అని అర్థం. ఈ నాలుగు కలర్స్ పేపర్స్ ప్రింట్ తీసే సమయంలో పలురకాలుగా మిక్స్ అయిపోయి కొన్ని లక్షల సంఖ్యలో కలర్స్ ను సృష్టిస్తాయి.
Advertisement
ఇవి కూడా చదవండి : హౌరా బ్రిడ్జి నట్లు, పిల్లర్స్ లేకుండా.. ఎలా నిలబడిందో మీకు తెలుసా..?
అందుకే ఈ రంగులను ప్రాథమిక రంగులు అని అంటారు. కలర్స్ కి సంబంధించిన అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కలర్స్ ప్లేట్స్ అటూ ఇటూ కదిలి ప్రింటింగ్ తీసిన పేపర్స్ ను కానీ, ఫోటోలు కానీ బ్లర్ గా ప్రింట్ అవుతాయి. మరొక విషయం ఏమిటంటే న్యూస్ పేపర్ కి మధ్యభాగంలో సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి పేపర్ ని తీసుకొని ప్రతి పేజీ ని చెక్ చెయ్యడం అసంభవం. దాన్ని తెలుసుకోవడానికి పైన చెప్పిన ఈ నాలుగు చుక్కలను గమనిస్తే సరిపోతుంది. అవి సరైన పద్ధతిలో వస్తూ ఉంటే పేజీలన్నీ సరైన క్రమంలో వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇవి బ్లర్ అయితే పేపర్ మొత్తం బ్లర్ అయినట్టు తెలుసుకోవాలి.