Advertisement
భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది. ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది. రైలు దేశ ట్రాఫిక్ వ్యవస్థకు వెన్నెముక. ప్రతిరోజు లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రైల్వే నెట్వర్క్ దాదాపు అన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి విమానాశ్రయాలు, రన్వేలు లేని ప్రదేశాలకు కూడా రైలులో వెళ్లిపోవచ్చు.
Advertisement
Read also: పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..?
Advertisement
అయితే చాలా వరకు రైల్వే ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో పలుచోట్ల రకరకాల కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రకరకాల కోడ్స్ కి వేరువేరు అర్థాలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే రైల్వే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అయితే రైల్వే ప్లాట్ఫారం మీద అంచున ఉండే పసుపు రంగు లైన్ ను మీరు ఎప్పుడైనా గమనించారా? దీనికి అర్థం ఏమిటో ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? దీనిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు ప్లాట్ఫామ్ మీద వెళ్లేటప్పుడు దాని వేగాన్ని బట్టి ప్లాట్ఫారం అంచున ఒక రకమైన ప్రత్యేక వాతావరణన్ని ఏర్పాటు చేస్తుంది. అది ఎరుపు రంగు టైల్స్ ఉన్న ప్రాంతం వరకు సృష్టించబడుతుంది.
ఆ ఎరుపు రంగు ప్రదేశంలో మనిషి ఉంటే రైలు వేగం ద్వారా ఉత్పత్తి అయ్యే గాలికి మనం రైలు దగ్గరకు నెట్టివేయబడతాము. దీంతో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎరుపు రంగు టైల్స్ ఉన్నచోట నిలబడరాదని.. పసుపు రంగు లైన్ దాటి లోపలికి నిలబడకూడదని ఈ లైన్ ని ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణించేటప్పుడు ఆ లైన్ దాటి లోపల నిలబడనట్లయితే సురక్షితంగా ఉంటాము. కనుక పసుపు రంగు లైన్ నీ దాటి చివరి వరకు పోకూడదని సూచికగా ఆ లైన్ ని ఏర్పాటు చేస్తారు.
Read also: ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూసారా..?