Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పసుపును గౌరీదేవిగా భావిస్తూ ఉంటాం. మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడి దగ్గర నుంచి మొదలు కాళ్లకు పెట్టుకునే వరకు పసుపు ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. ఇక తమిళనాడులో అయితే మొహం దగ్గర నుంచి మొదలు శరీరమంతా పసుపు రాసుకుంటారు. అంటే పసుపు కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వివాహం, శుభకార్యాలయినప్పుడు పసుపును తీసుకోవాలంటే ముందు పసుపు కొమ్ములను తీసుకొని దంచు తారు. అలా దంచిన పసుపునే తలంబ్రాల బియ్యం లో కలుపుతారు. అంటే ఆ రోజు నుండి మేము మంగళకరమైన కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం అని అర్థం.
Advertisement
Advertisement
దేవతలు ఎవరైతే ఉన్నారో మీరు మమ్మల్ని అనుగ్రహించండి అంటూ, ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా పెళ్లి అయ్యేవరకు ఆ జంటకు ఎలాంటి దోషాలు తగలకుండా ఉండాలని తాంబూలాలు తీసుకునే సమయంలోనే పసుపు వారితో దంచిస్తారు. ఎందుకంటే ఎలాంటి దోషాలు ఉండకుండా పసుపు ఏవిధంగా పచ్చగా ఉంటుందో వీరి జీవితాలు కూడా పచ్చగా, ఆనందంగా ఉండాలని ఇలా చేస్తారు. వీరు ధరించే సమయంలో కొన్ని పసుపు కొమ్ముల ముక్కలు కింద పడి పోతూ ఉంటాయి. మళ్లీ వాటిని తీసి అందులో వేయరు.. దీనికి ప్రధాన కారణం మీ జీవితంలో కూడా గొడవలు అనేది వస్తూపోతూ ఉంటాయి.. ఆ విధంగానే దంచుతూ ఉంటే ఆ ముక్కలు కింద పడిపోతే మీ గొడవలు కూడా అలాగే పోవాలని వాటిని అందులో వేయారట.
మన మనసును రోలు గా తీసుకుంటే మన మనస్సు అనేది అంత లోతుగా ఉంటుంది. అందులో మనం ఎన్నో రకాలుగా దాచి పెడుతూ ఉంటాం. అలా బాధ ని బయటకు రాకుండా లేదంటే ఎప్పటికప్పుడు బయటకు పెడుతూ ఇద్దరు ఆనందంగా ఉండాలని రోలు రోకలి ఎలాగో ఆ విధంగా పచ్చగా ఉండాలని భావిస్తారు. అలాగే తలంబ్రాల లో కూడా పసుపు కలిపి, అంత పచ్చగా నిరాహారంగా ఉండకుండా దీవించి వాటిలో పసుపు కలిపి ఒకరిపై ఒకరు వివాహంలో పోసుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారు.
ALSO READ:
టాలీవుడ్ లోని ఈ హీరోల చెడ్డ అలవాట్లు ఏంటో మీకు తెలుసా?