Advertisement
మన దూర ప్రయాణాలు చేసినప్పుడు రైల్లో వెళుతూ ఉంటాం. మనం రైలు ఎక్కడానికి స్టేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రం మనం మన భోగి ఎక్కడుందో దాని నెంబర్ ఎక్కడుందో వెతుక్కొని మరి వెళ్లి కూర్చుంటాం. అది గమనించిన మనం రైల్లో ఒక విషయాన్ని మాత్రం మనం గమనించం. అది ఏంటో ఒక సారి చూద్దాం..?
Advertisement
మనం రైలు వెళ్తున్నప్పుడు చాలాసార్లు చూసే ఉంటాం. రైలు చివరి పెట్టె వెనుక భాగంలో ఉన్నటువంటి ఆంగ్ల అక్షరం “ఎక్స్” అని చాలా పెద్దగా రాసి ఉంటుంది. దాన్ని మనం చాలాసార్లు చూసే ఉంటాం. మరి అక్కడ ఎక్స్ అని ఎందుకు రాసి ఉంటుందని అనుమానం మీకు కలగలేదా.. తెలియకుంటే ఈ విషయాన్ని ఒకసారి తెలుసుకోండి. రైలు బోగీల్లో చివరి భోగి వెనుక ఎక్స్ అని రాసి ఉంటే మాత్రం ఆ పెట్టే ఇక చివరిది అని అర్థం. అంతేకాకుండా అక్షరం కిందే ఒక ఎర్రని లైట్ కూడా ఉంటుంది. దాని పక్కనే ఎల్ వి అనే ఒక బోర్డు కూడా తగిలించి ఉంటుంది.
Advertisement
ఇవన్నీ “X” అక్షరం లాగే ఉపయోగపడతాయి. దీనివల్ల రైలుకు ఉన్న ఆ పెట్టను చివరి పెట్టేగా చెబుతారు. ఎక్స్ అక్షరం అనేది వెలుగు ఉన్న సమయంలో ఉపయోగపడితే, ఎర్ర లైటు అనేది రాత్రిపూట ఉపయోగపడుతుంది. దీనివల్ల దాన్ని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టేలతో వెళ్తుంది అని అర్థం చేసుకుంటారు. ఒకవేళ రైలు చివరి పెట్టకు ఈ అక్షరాలు ఏవి లేకపోతే, అది ప్రమాదవశాత్తు కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత రైల్వే అధికారులకు తెలియజేస్తారు.