Advertisement
మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే మాంసం, మందు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని రవివారం అని అంటారు. అది సూర్యుడి రోజు కావడంతో ఆ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆదివారం అసలు మాంసాహారం ముట్టకూడదు. కానీ మనం సూర్యుడి రోజుని అపవిత్రం చేస్తున్నాం. అసలు ఆదివారం రోజున మాంసాహారం అస్సలు ముట్టకూడదు అదేంటో మన ఇప్పుడు చూద్దాం.. మనకు స్వాతంత్ర్యం రాకముందు గురుకులాలు ఉండేవి. దీంతో ఆదివారం రోజు ప్రత్యేకంగా పూజలు చేసేవారు.
Advertisement
also read: నెయ్యి, బీర్లు, పచ్చళ్లను ఎన్ని రోజుల వరకు తినవచ్చు.. వాటికి Expire date ఉంటుందా !
Advertisement
సూర్యుడికి ఇష్టమైన రోజు కాబట్టి అలా ఉండేవారు. ఆ తర్వాత బ్రిటీష్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని విడనాడితే తప్ప పరిపాలించడం వీలుకాదని భావించారు. దీంతో ఆదివారం ఈ ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించారు. చాలా మందికి మద్యం, మాంసాన్ని అలవాటు చేశారు. దీని వల్ల మన ఆచార వ్యవహారాలు అన్నీ మంటగలిసి పోయి ప్రాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ వచ్చాం. పూర్వ కాలంలో బ్రిటిష్ వారికి ముందు ఆదివారం వచ్చిందంటే కటింగ్, షేవింగ్ కూడా చేసుకునేవారు కాదు.
గోల్డ్ కొనేవారు కాదు. ఇవన్నీ సూర్య దేవుడికి ఇష్టం లేని పనులు. అందుకే ఆదివారం ఈ పనులు చేసేవారు కాదు ఆ రోజుల్లో. కానీ బ్రిటిష్ వారు వీటన్నిటినీ విడనాడాలని కుట్రలు చేసి ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టి ఆదివారం ఇవన్నీ చేసుకునేలా అలవాటు చేసి మనల్ని వారి చేతుల్లోకి తెచ్చుకొని ఈ సాంప్రదాయాలను అలవాటు చేశారు.. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం మాంసం తినకూడదని మన జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు.
also read:పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 8 మంది హీరోయిన్ల కెరియర్ ఆగిపోయిందా..?