Advertisement
తెలుగు చిత్రసీమని దేశమంతా చూసే విధంగా సరికొత్త విజువల్ ఎఫెక్ట్ తో వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాహుబలి. ప్రభాస్, అనుష్క, రానా,రమ్యకృష్ణ, తమన్నా,సత్యరాజ్, నాజర్ ప్రధానమైన పాత్ర లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా 2015 జూలై 10వ తేదీన థియేటర్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడే అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంతో ట్విస్ట్ పెట్టి సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచారు.
Advertisement
అనేక అంచనాల నడుమ వచ్చినటువంటి బాహుబలి 2 మూవీ ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీలోనే రికార్డులు కొల్లగొట్టి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి చరిత్రలో నిలిచింది. తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అనువాదమైన ఈ మూవీ రికార్డులను మాత్రం తిరగరాసింది అని చెప్పవచ్చు. అందరి దృష్టిని ఆకర్షించేలా బాహుబలి2 పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇదంతా పక్కనబెడితే బాహుబలి మూవీలో రానా బల్లాల దేవుడిగా కనిపించారు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ బల్లాల దేవుడి పాత్ర చేశారు.
Advertisement
అయితే సెకండ్ పార్టులో మాత్రం ఆయన ముఖంపై ఒక గీత కనిపిస్తుంది. మరి ఆ గీత ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనే విషయం ఎవరికైనా గుర్తుందా.. అయితే బళ్ళలదేవుడు గీతను తనకు తానే పెట్టుకున్నాడు. కుమార వర్మ తనకు హాని చేయడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడం కోసం అలా చేసాడు. అయితే ఈ గీత కూడా ఎక్కడా మిస్ కాకుండా జక్కన్న జాగ్రత్త తీసుకున్నారు.. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి చిన్న చిన్న విషయాలపై కూడా ఎంతటి జాగ్రత్త వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.
ALSO READ;
టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వారి కంటే ఎక్కువ సంపాదిస్తారని తెలుసా..?