Advertisement
మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకువెళ్లిన సినిమాలలో “ఘరానా మొగుడు” చిత్రం ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మన్నన్ సినిమాకు రీమేక్ ఇది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 90వ దశకంలో వచ్చిన ఘరానా మొగుడు అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 10 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. అప్పటివరకు తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టిన చిత్రమిది. అంతకుముందే చిరంజీవి సూపర్ డూపర్ హిట్స్ గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలు సాధించిన 100 రోజుల కలెక్షన్స్ ను ఈ చిత్రం 50 రోజులలోనే సాధించడంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నగ్మా మెయిన్ హీరోయిన్ గా నటించగా.. సెకండ్ హీరోయిన్ గా వాణి విశ్వనాథ్ కనిపించింది.
Advertisement
Advertisement
నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ అంతే కీలకం. ముఖ్యంగా చిరంజీవి – వాణి విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు, సీన్లు సినిమా విజయంలో హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వాణి విశ్వనాథ్. ఈ సినిమా తర్వాత నా మొగుడు నాకే సొంతం, కొదమ సింహం, వదిన గారి గాజులు, మామ – కోడలు, లేడీస్ స్పెషల్, సీతాపతి చలో తిరుపతి, రైతు భారతం తదితర చిత్రాలలో నటించింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది ఈ అందాల తార. అలా సినీ కెరీర్ పిక్స్ లో ఉండగానే వాణి విశ్వనాథ్.. ప్రముఖ మలయాల నటుడు బాబురావును ప్రేమించి వివాహం చేసుకుంది. 2002లో పెళ్లి చేసుకున్న వాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహం అనంతరం జయ జానకి నాయక వంటి సినిమాల్లో కూడా నటించింది వాణి. అడపాదడపా సినిమాల్లో కనిపించినప్పటికీ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ తరువాత మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేస్తుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం వాణి విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ వివాహ వేడుకలో తలుక్కుమంది ఈ అందాల తార. కొంచెం బొద్దుగా మారారే కానీ అందంలో ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం వాణి విశ్వనాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read also: పదేళ్ల ప్రేమ పెళ్లి ఇవ్వని అనుభవం సహజీవనం ఇచ్చింది… సహజీవనం చేస్తున్న మహిళ అనుభవాలు…!