Advertisement
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. ఇక్కడికి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక మరొక బాధ అన్నట్లు ఉంటుంది. తెర పైన నటించే వాళ్ళను మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా ఒక సినిమాతో ఎంతో పేరు తెచ్చుకోవడమే కాక.. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు బాగా గుర్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేస్తుంది ఈ సమాజం. అలా తెరవెనకే కనుమరుగైపోయిన హీరోయిన్లలో ఒకరు గజాల.
Advertisement
Read also: హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!
Advertisement
ఈమె అసలు పేరు రాజి. సినిమాలలోకి వచ్చాక తన పేరును గజాల గా మార్చుకుంది. అప్పటి అగ్ర హీరోలు అందరి సరసన నటించింది గజాల. 2001లో నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. కలుసుకోవాలని, స్టూడెంట్ నెంబర్ 1, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తెలుగులో దాదాపు 30 సినిమాలలో నటించింది గజాల. అదే సమయంలో టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడింది. ఆ తర్వాత అతను మోసం చేశాడంటూ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
అయితే అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది. ఆ సమయంలో సీనియర్ హీరో అర్జున్ ఆమెను సేవ్ చేశారని.. అన్ని విధాలా అండగా ఉన్నాడన్న టాక్ బయటకు వచ్చింది. 2011లో విడుదలైన మనీ మనీ మోర్ మనీ అనే చిత్రంలో చివరిగా కనిపించింది గజాలా. ఇక 2016లో టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటుంది గజాల. ఇక ఆమె కుటుంబం కువైట్ లో స్థిరపడింది. ప్రస్తుతం భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించాలని భావిస్తుందట.
Read also: శ్రీదేవిని కమల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?