Advertisement
పటాస్ అనే టీవీ షో ద్వారా బుల్లితెర మీద యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తనదైన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. భాను మొదట యాంకర్ అవుదామని కాకుండా యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ షోలోకి వెళ్ళక ముందు కొన్ని సినిమాలలో నటించింది భాను శ్రీ. కానీ అవి అంతగా ఆడలేదు. దీంతో భాను శ్రీ అందంగా ఉండడంతో యాంకర్ గా అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని యాంకర్ గా భాను శ్రీ సక్సెస్ అయింది.
Advertisement
Advertisement
ఈమె సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భాను శ్రీ కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో ఒక సాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసింది. ” డార్లింగే” అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ అనుష్క వెనకాల భానుశ్రీ కూడా స్టెప్పులు వేసింది. అంతేకాక ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిన్నాచితక పాత్రలలో కూడా కనిపించింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో భాను శ్రీ తమన్నా డూప్ గా కూడా నటించింది అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.
వీటితోపాటు రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్, శర్వానంద్ మహానుభావుడు సినిమాలలో కూడా నటించింది. ఇలా ఆమెకు పలు సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో పాటు హీరోయిన్ గా కూడా ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా మౌనం, నల్లమల లాంటి సినిమాలలో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం భాను శ్రీ నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతాయి.