Advertisement
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాలలో సమరసింహారెడ్డి కూడా ఒకటి. 1999 సంక్రాంతి సీజన్ లో వచ్చి దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నట విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజ్ లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది సమరసింహారెడ్డి. ఇక ఈ చిత్రంలో సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. అలాగే ఈ చిత్రంలో సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది.
Advertisement
ఈ మూవీలో ముగ్గురు అక్క చెల్లెల పాత్రలలో దివ్యాంగురాలి పాత్ర (సరస్వతి) లో అద్భుతంగా నటించింది సహస్ర. బాలకృష్ణ, ఈ అమ్మాయి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్స్ అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలో దివ్యాంగురాలి పాత్రలో నటించిన సహస్ర ఈ సినిమా కంటే ముందే ఎన్నో వందలాది చిత్రాలలో నటించింది. రౌడీ అల్లుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, సంరసింహారెడ్డి, మేజర్ చంద్రకాంత్.. ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. అయితే చదువు పూర్తి చేయాలనే ధ్యాసతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఉన్నత చదువులు చదివింది. వీరిది వరంగల్ కాగా.. వీరి కుటుంబం హైదరాబాద్ కి వచ్చి స్థిరపడింది. “ఉద్యమం” ఈమె మొదటి చిత్రం. సమరసింహారెడ్డినే సహస్ర నటించిన ఆఖరి సినిమా కావడం గమనార్హం.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరైంది సహస్ర. అయితే అప్పటికి, ఇప్పటికీ ఈమె చాలా మారిపోయింది. కొంచెం పొద్దుగా ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉంది. మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ పూర్తి చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది సహస్త్ర. ” భానుచందర్ గారి ఉద్యమం నా మొదటి సినిమా. అప్పుడు నేను చిన్నపిల్లను కావడంతో హీరోలు అందరూ నన్ను బాగా చూసుకునేవారు. రామ్ చరణ్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న టెడ్డీబేర్ తో ఆడుకునేదాన్ని. చరణ్ నాకు ఉప్మా చేసి పెట్టాడు. చరణ్ అలా చేయడం నా లైఫ్ లో మరిచిపోలేని క్షణాలు. సమరసింహారెడ్డి నా చివరి సినిమా. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెడదామని సినిమాలకు దూరమయ్యాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.