Advertisement
ప్రతి మనిషి సొంతిల్లును కట్టుకోవాలనుకుంటాడు. ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కనీసం 15 నుంచి 20 లక్షలు కావాలి. అది ల్యాండ్ ఉంటేనే. ఒకవేళ ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవాలంటే మధ్యతరగతి వారికి సాధ్యం కానిది. అలా ఇల్లు కట్టుకునే ప్లేస్ ఉన్నవారు ఈ విధంగా చేస్తే ఇంటి నిర్మాణాన్ని ఈజీగా చేయవచ్చు అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అవేంటో చూద్దామా..
Advertisement
భార్యాభర్తలు ఇద్దరు కలిసి నెలకు 40,000 సంపాదిస్తే వారు ఉండేటువంటి సిటీలో 30 లక్షల విలువ చేసే ప్లాట్ కొనుక్కోవచ్చు. పిల్లల కేరింగ్ తో పాటు ఇల్లును కూడా కొనుగోలు చేయవచ్చని అంటున్నారు మార్కెట్ నిపుణులు. దీనికి ముందు మీరు చేసే జాబ్ గ్యారంటీ ఉంటుందో లేదో అన్నది ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మీకు లోన్ ఎంత వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. గ్రాస్ సాలరీలో సగం ఈఎంఐ కట్టుకోవాల్సి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే, వేరే ఈఎంఐలు ఉండకూడదు.
Advertisement
సిబిల్ స్కోర్ బాగుండాలి. అయితే ఇల్లు తీసుకుంటే మీ సాలరీలో పదివేల రూపాయలు నెలనెలకు ఈఎంఐ కట్టుకోవాలి. అంటే మీరు ఒకవేళ రెంటు ఇంట్లో ఉన్నా కానీ 10000 చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎన్ని సంవత్సరాలు మీరు జాబ్ చేసిన రెంటు పెరుగుదల తప్ప తగ్గదు. అలాంటిది మీరు సొంత ఇల్లు కొనుక్కుంటే అలా కొన్నేళ్లపాటు ఈఎంఐ కట్టుకుంటే ఇల్లు మీ సొంతం అవుతుంది.
మరికొన్ని ముఖ్య వార్తలు: