Advertisement
దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ధన్ తెరాస్ లేదా ధన త్రయోదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజున లక్ష్మి దేవి, గణేష్, కుబేరుడుకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తూ ఉంటారు. కానీ, ఈరోజున కొంతమంది తెలియక కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిని కొంటె కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుని ముందు జాగ్రత్త పడండి.
Advertisement
దసరా నవరాత్రుల సందడి పూర్తవ్వగానే హిందువులను పలకరించే మరో సందడైన పండగ దీపావళి. దీపావళి ముందు రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ పదకొండవ తేదీ మరియు పన్నెండవ తేదీలలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. దీపావళికి రెండు రోజుల ముందు అంటే త్రయోదశి రోజున ధన్ తేరస్ వస్తుంది. కొన్ని ప్రాంతాలలో దీపావళి పండుగ ఐదు రోజులు జరుపుకుంటూ ఉంటారు. ఈ ఐదు రోజుల పండుగ ధన్ తేరస్ తో మొదలవుతోంది.
Advertisement
ధన్ తేరస్ రోజున లక్ష్మి దేవిని, కుబేరుడిని పూజిస్తారు. తమ జీవితంలో సంతోషాలను, ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే తెలిసి చేసినా సరే, తెలియక చేసినా సరే.. ఈరోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకూడదు అని చెబుతుంటారు. అలాగే గాజుని రాహువుకి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఈరోజున గాజు వస్తువులను కూడా కొనకూడదు. అలాగే కత్తెర, కత్తులు లాంటి పదునైన వస్తువులను కూడా కొనకూడదు. పదునైన వస్తువులు ఈరోజున ఇంట్లోకి తీసుకు రావడం వలన కూడా వాస్తు దోషాలు కలుగుతాయి. ఇక హిందూమతంలో నలుపు రంగుని చాలా అశుభంగా భావిస్తారు. ఈరోజున నలుపు రంగు వస్తువులను కొనడం కూడా శ్రేయస్కరం కాదు. ఇంకా, నూనె, నెయ్యి వంటి ఆయిలీ వస్తువులను కూడా ధన్ తెరాస్ రోజున కొనకూడదు. అయితే.. దీపావళికి దీపాలు వెలిగించాలంటే ఎక్కువ నూనె కావాలి కాబట్టి ధన్ తెరాస్ కంటే ముందే నూనెను కొని ఉంచుకోవాలి.
మరిన్ని..
Lingochha Movie Review : “లింగోచ్చా” మూవీ రివ్యూ
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా..?