Advertisement
శని దేవుడిని న్యాయ ప్రదాత అని పిలుస్తుంటారు. ఆయన వలన చెడు జరుగుతుంది అని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన కర్మ ఫలాలను అనుసరించే ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మనం సరిగ్గా నడుచుకుంటే మనకి మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. శనివారం శనిదేవుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. అయితే.. శని వారం ఏయే పనులు చెయ్యొచ్చు, ఏయే పనులు చెయ్యకూడదు అన్న విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Advertisement
శనివారం రోజున శనిదేవుడికి కోపం వచ్చే పనులు చేస్తే మీకు కష్టాలు ఎక్కువ అవుతాయి. హిందూ మతం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఆది వారం సూర్య దేవుడిని, సోమవారం శివుడిని, మంగళ వారం ఆంజనేయ స్వామిని, బుధవారం వినాయకుడిని, గురు వారం విష్ణువు, సరస్వతిని, శుక్రవారం లక్ష్మి దేవిని, శనివారం శని దేవుడిని, కాళీ దేవిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. శనిదేవుడినే న్యాయాధిపతిగా పేర్కొంటారు. మనుషులు చేసే మంచి, చెడు లనే దృష్టిలో పెట్టుకుని ఆయన కర్మని అందిస్తాడు.
Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కొన్ని వస్తువులను కొంటే శనిదేవుడికి కోపం వస్తుందట. ఇనుముతో చేసిన వస్తువులను శనివారం రోజున ఇంటికి తీసుకురాకూడదట. వాటిపై శనిదేవుడి కళ్ళు పడితే మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉప్పుని కూడా శనివారం కొనుగోలు చెయ్యకూడదు. శనివారం కొన్న ఉప్పు వంటల్లో వాడితే అనారోగ్యం వస్తుందని అంటారు. అలాగే గోర్లు తీయడం, గోర్లు కొరకడం, జుట్టు, గడ్డం తీయడం లాంటి పనులను కూడా శనివారం రోజున చేయకూడదట. అలాగే శనివారం రోజు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకుని, మద్యం, మాంసాహారులకు దూరంగా ఉండండి. అలాగే నల్ల నువ్వులు, నల్ల బూట్లను శనివారం రోజున కొనకండి. శని గ్రహం వలన కలిగే దుష్ఫలితాలను దూరం చేయడం కోసం శని దేవుడిని బెల్లం మరియు పప్పులతో పూజించాలి. అలాగే శనివారం రోజున పాదరక్షలు, నల్ల దుప్పట్లు, నల్ల గొడుగులు, నల్ల నువ్వులు, కిచిడి దానం చేయడం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది.
Read More:
విజయ్ సినిమాలు ఆడనివ్వకుండా జయలలిత ఎందుకు అడ్డుకున్నారు ? జయ లలిత వల్లే పార్టీ పెట్టాడా ?
రోజూ “అక్కా అక్కా..” అని పిలిచి మాస్టర్ ప్లాన్ తో టీచర్ ని అనంత లోకాలకి పంపేశాడు.. అసలేం జరిగిందంటే?
అమ్మాయిలు ఎందుకు అమాయకులను దూరం పెట్టి.. చెడ్డవాళ్లకు దగ్గరవుతారు?