Advertisement
ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్న వారికి కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయట. ప్లాన్లు చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Advertisement
లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెళ్లి తర్వాత కొంతమంది ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్లను వాడుతూ ఉంటారు. అయితే అలా టాబ్లెట్లు వాడటం వల్ల గర్భానికి సంబంధించిన సమస్యలు వచ్చి పూర్తిగా అసలు పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం కూడా ఉందట. అంతేకాకుండా అసలే ఇప్పుడు పెళ్లిళ్లు 30 దాటిన తర్వాత చేసుకుంటున్నారు. ఇంకా లేట్ అయితే వయసు పెరిగి అండం అలాగే శుక్రకణాల ఉత్పత్తి లో వచ్చే మార్పుల వల్ల పిల్లలు పుట్టకపోతే అవకాశం ఉందట.
Advertisement
మరోవైపు భార్య భర్తలు సరైన వయసులో ఉన్నప్పుడు పిల్లలను కంటే వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆలస్యమైతే పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయట. పెళ్లి తర్వాత పిల్లలను కనేందుకు కావాలని సమయం తీసుకుంటే చుట్టుపక్కల వాళ్లు అనే మాటలతో మానసికంగా కృంగి పోయే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి భార్య భర్తలు పెళ్లి తర్వాత పిల్లలు ఎప్పుడూ కలిగితే అప్పుడే కారణాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎంజాయ్ కోసమో.. కెరీర్ కోసం వాయిదా వేస్తూ పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.