Advertisement
ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ గా ఉన్నా రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడం మాత్రం అవసరం. అయితే.. రాత్రి పూట కేవలం నిద్రపోవడం మాత్రమే చేయాలి. అనవసరమైన పనుల జోలికి వెళ్ళకూడదు. కొన్ని పనులను అస్సలు రాత్రిపూట చేయకూడదట. ఒకవేళ బలవంతంగా మీరు చేసినా.. ఆ ప్రభావం మీ నిద్రపై పడి.. నిద్ర చెడిపోతుంది. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
కొంతమంది ఉదయాన్నే లేవలేకో.. కుదరకో.. రాత్రి పూట వ్యాయామం చేయాలనీ అనుకుంటారు. అయితే రాత్రిపూట వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట వ్యాయామం చేస్తే శరీరం ఉత్తేజితం అయ్యి నిద్ర పోతుంది. అలాగే పడుకోవడానికి రెండు, మూడు గంటలకు ముందు కాఫీ అస్సలు తాగకూడదు. ఇందులో ఉండే కెఫీన్ నిద్రని దూరం చేస్తుంది. ఇక ఆఫీస్ కి సంబంధించిన ఈమెయిల్స్ ను కూడా చెక్ చేయకూడదు. ఏదైనా పరిష్కరించలేని మెయిల్ గురించి ఆలోచిస్తూ.. రాత్రంతా వేచి ఉండాల్సి వస్తుంది.
Advertisement
అలాగే సాయంత్రం దాటాక నీరు తాగడం కూడా తగ్గించాలి. ఎక్కువ నీరు తాగితే నిద్ర మధ్యలో లేవాల్సి ఉంటుంది. అందుకే నీరు త్రాగేటప్పుడు చూసుకుని తాగాలి. నిద్రించే రెండు గంటల ముందు ఫోన్స్ ను దూరంగా ఉంచాలి. స్మార్ట్ ఫోన్స్ నుంచి వచ్చే ఆర్టిఫిషల్ లైట్ కారణంగా శరీరంలో మెలటోనిన్ ప్రొడక్షన్ రిథమ్స్ దెబ్బతింటాయి. అందుకే ఫోన్ కి దూరంగా ఉండాలి. ఇక ఆల్కహాల్ తాగే వారు కూడా నిద్రపోవడానికి మూడు గంటల ముందు మందు తాగకూడదు. వైన్ లోని షుగర్స్ రాత్రి సమయంలో మీ మనసుని మారుస్తాయి. ఇక జీవిత భాగస్వామితో కూడా గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయద్దు. రాత్రి భోజనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట వైట్ రైస్ లాంటివి తినకుండా ఉండడమే మంచిది.
Read More: