Advertisement
శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే,
Advertisement
శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోలు కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతవి లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు. కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. కానీ, పాతది తీయరాదు. శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు, ఇవ్వద్దు. ఎవరికైనా సహాయం అవసరమైతే చేయండి. కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు వద్దు.
Advertisement
శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం పాటిస్తారు. ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు. ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికి ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు. పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు. శుక్రవారం రోజున బూజు దులపడం అస్సలు చేయకూడదు. మగవారు, ఆడవారు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు.
READ ALSO : ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?