Advertisement
హిందూ సనాతన ఆచార సాంప్రదాయాలలో దానధర్మాలు చేయడం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. సనాతన ధర్మంలో నాలుగు యుగాలలోని వివిధ దానాల లక్షణాలను వివరించింది. సత్య యుగంలో తపస్సు, త్రేతా యుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యాగం.. కలియుగంలో కేవలం దానం మాత్రమే వ్యక్తిని క్షేమంగా ఉంచగలదు. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయంలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా చూస్తారు. అయితే దానధర్మాలు చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దానధర్మాలు చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ ఐదు వస్తువులను దానం చేయడం ద్వారా మీ అదృష్టంపై చెడు ప్రభావం చూపుతుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
1) ఇనుము.
ఒక వ్యక్తికి ఇనుప వస్తువును దానం చేస్తే మీరు ఆర్థిక సంక్షోభంలో పడ్డట్టే. ఇనుముని దానం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సుఖసంతోషాలు కూడా వెళ్ళిపోతాయి. ఇనుములో శని నివసిస్తుంది. దానిని దానం చేయడం వల్ల శని దేవునికి కోపం వస్తుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఇనుముని ఎవరికీ దానం చేయకూడదని.. ఎవరైనా ఇచ్చిన తీసుకోకూడదు.
Advertisement
2) అగ్గిపుల్ల.
అగ్గిపుల్లలు దానం చేయడం వల్ల ఇంట్లో అనవసరంగా గొడవలు మొదలవుతాయి. అగ్గిపుల్లని దానం చేయడం వల్ల కుటుంబ శాంతికి విగాథం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గి అనవసరంగా గొడవలు మొదలవుతాయి.
3) ఆవనూనె.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆవనూనె శని దేవునికి సంబంధించింది. శని దేవుని ప్రభావాన్ని తొలగించడానికి ఆవాల నూనెను దానం చేస్తారు. ఒకవేళ మీరు డబ్బు ఇవ్వకుండా అవనునే తీసుకుంటే శని దేవుని ఆగ్రహానికి గురవుతారు.
4) ఉప్పు.
ఉప్పు దానం చేస్తే చాలా కష్టాలు పెరుగుతాయి. ఉప్పు దానం చేయడం ద్వారా అప్పుల బారిన పడతారు. ఉప్పుని దానం చేయడం వల్ల శని దేవుని ఆగ్రహానికి గురవుతారు. అందుకే ఉప్పుని దానం చేయకూడదు.
5) నల్ల నువ్వులు.
నల్ల నువ్వులు రాహువు, కేతువు, శని గ్రహానికి సంబంధించినవి. నల్ల నువ్వులని దానం చేయడం వలన మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అంతేకాక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అందుకే దానం చేసేటప్పుడు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
Read also: “లవ్ యు రాజా” అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?