Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్య విషయం కాదు. కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కానీ జీవిత కాలంలో ఇల్లు కట్టలేక పోతారు. కొంతమంది ఇల్లు కట్టడం లేదా కొనే పరిస్థితి వస్తుంది కానీ చివరి సమయంలో అది వికటిస్తుంది. ఏది ఏమైనా ఇల్లు కట్టడం అనేది సాధారణ విషయం కాదు. కానీ కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి తప్పులు అసలు చేయకూడదట.. ఇలా చేస్తే సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దామా..
Advertisement
గోమాతకు పూజ చేయడం:
సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు చాలామంది గోమాతను పూజ చేస్తారు. ముఖ్యంగా కొంతమంది గోమాతను ఇంట్లోకి ముందుగా ఆహ్వానిస్తారు. అంతేకాకుండా గోమాతను ఇంటి చుట్టూ తిప్పి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలో సంతానం సమృద్ధి జరిగే హ్యాపీగా ఉంటారని నమ్ముతారు. తప్పనిసరిగా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు గోమాత పూజ చేయాలని పండితులంటున్నారు.
ఆడపిల్లల ఆహ్వానం:
Advertisement
తప్పనిసరిగా కొత్త ఇల్లు కట్టుకున్న సమయంలో ఆ ఇంటి ఆడపిల్లను ఆహ్వానించి, ఆమెతో కొత్త బిందెలో నీళ్లు తెప్పించి ఇంటి ప్రధాన ద్వారం గడప కడిగించాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఆడబిడ్డలను కూడా పిలవకుండా తంతు నిర్వహిస్తున్నారు. అలా చేస్తే మంచి జరగదని పండితులు అంటున్నారు..
గుమ్మడికాయ కొట్టకూడదు:
అయితే కొత్త ఇంట్లోకి వెళ్ళే సమయంలో చాలామంది కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ, కర్పూరం వెలిగించి తిప్పిన తర్వాత గడపపై గట్టిగా కొడతారు. అయితే ఇంటి గడపపై ఆ గుమ్మడికాయని కొట్టవద్దట గడప ముందు ఉన్న స్థలంలో మాత్రమే కొట్టాలని పండితులు అంటున్నారు. అంతే కాదు కొట్టిన గుమ్మడికాయను రెండు ముక్కలైన తర్వాత క్రాస్ పద్ధతిలో అటొకటి ఇటొకటి పెట్టాలి. కుడి సైడ్ ముక్కలను ఎడమవైపు, మరో ముక్కను కుడివైపు పెట్టి పూజ చేయాలి.
మరికొన్ని ముఖ్య వార్తలు: