Advertisement
ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఒక్కతరం బాగుంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు మేనరికంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. హిందువుల్లో అయితే మేనబావ లేడు అంటే మేనమామలను వివాహం చేసుకునేవారు. అలా దగ్గర సంబంధం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
Advertisement
తమ ఆస్తి తమ కుటుంబంలోని వారికే చెందాలని, అంతేకాకుండా దగ్గర వారి లక్షణాలు గుణం ముందే తెలుస్తాయి కాబట్టి సమస్యలు తక్కువగా వస్తాయని నమ్మేవారు. అయితే ప్రస్తుతం ఏకంగా రాష్ట్రాలు దాటి మరి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. కుల మతాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే దూరం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు వారి లక్షణాలు తెలిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని లక్షణాలను బట్టి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?
పెళ్లికి ముందు అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని కచ్చితంగా తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్లవల్ల గొడవలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా చేసుకోబోయే అబ్బాయికి అయినా అమ్మాయి గతంలో ఎవరినైనా ప్రేమించారా, ప్రస్తుతం ఏమైనా లవ్ ఎఫై** లు ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. వీటితోపాటు తమకు కాబోయే వారు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారా? ఎక్కువగా కోప్పడతారా లాంటి లక్షణాలు కూడా ఉన్నాయో లేదో తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
READ ALSO : వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?