Advertisement
మొబైల్ ఫోన్ వాడకం ఈరోజుల్లో కొందరికి వ్యసనంలా తయారయింది. ఎక్కడికెళ్లినా చేతిలో ఫోన్ ఆపరేట్ చేయడం అలవాటయింది. కొంతమంది శౌచాలయాలకు వెళ్లిన మొబైల్ ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లకు పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలని, సాధ్యమైనంత వరకు టాయిలెట్ లో ఫోన్ వాడొద్దని సలహా ఇస్తున్నారు.
Advertisement
చాలామంది టాయిలెట్ కు వెళ్ళినప్పుడు కూడా మలవిసర్జన చేస్తూ దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ నిజానికి అలా చేయరాదు. దానివల్ల పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టాయిలెట్ లోకి మొబైల్ ను తీసుకుపోవడం వల్ల ఎక్కువ సేపు అందులో గడుపుతారు. దీని వల్ల ఎక్కువ సేపు మలవిసర్జన చేస్తూ కూర్చుంటారు. ఈ క్రమంలో శరీరంలో ఆ భాగాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా అది ఫైల్స్ కు, ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కనుక టాయిలెట్లలో ఫోన్లను వాడరాదు. టాయిలెట్లో సహజంగానే సూక్ష్మ క్రీములు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో టాయిలెట్ లో ఫోను ను వాడితే ఆ సూక్ష్మ క్రిములు ఫోన్ల పైకి చేరుతాయి.
Advertisement
తర్వాత అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. కనుక టాయిలెట్లలో ఫోన్ ని ఉపయోగించడం మానేయాలి. ఫోన్లను టాయిలెట్లను ఉపయోగించడం వల్ల సహజంగానే అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం పాటు టాయిలెట్లో గడుపుతారు. దీంతో ఉదయాన్నే ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. టాయిలెట్లో ఫోన్లను వాడడం వల్ల చెడు అ లవాట్లకు బానిసలు అయ్యే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలా చేయడం మనల్ని తప్పు ద్రోవ పట్టిస్తుంది. కనుక ఇకపై టాయిలెట్ కు వెళితే ఎవరైనా సరే ఫోన్లను వాడకండి.
ఇవి కూడా చదవండి: బాలయ్యతో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్