Advertisement
శని దేవుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి శని దేవుని కోపానికి గురవ్వక తప్పదు. మరి మీరు సైతం ప్రతి శనివారం ఆ శనీశ్వరుడిని పూజిస్తుంటే, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాదు, శని దేవుడికి బాగా ఇష్టమైన రోజు శనివారం. ఆ రోజున వీటిని అస్సలు తినకండి. కొంతమంది ఏమీ పట్టించుకోకుండా తినేస్తుంటారు. కానీ వీటిని తింటే శని దేవుడికి బాగా కోపం వస్తుందట. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Advertisement
మద్యం
శని ఆధ్యాత్మిక ప్రవర్తనను ఇష్టపడతాడు. అటువంటి పరిస్థితుల్లో శనివారం మద్యపానం లేదా ఏదైనా రకమైన మందులు జీవితంలో కష్టాలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి దుర్ఘుణాలకు దూరంగా ఉండాలి.
ఎర్ర పప్పు
శనివారం ఎర్ర పప్పు తినకూడదు. ఎరుపు రంగు అంగారకుడితో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడు, శని గ్రహాలు రెండు కోప స్వభావం గల గ్రహాలు. కాబట్టి శనివారం ఎర్రపప్పును ఆహారంలో తీసుకుంటే శని, కుజుడు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈ కారణంగా మీరు మీ జీవితంలో ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటారు.
Advertisement
ఎర్ర మిరపకాయలు
శని దేవుడు చల్లని వస్తువులను ఇష్టపడతాడు అని చెబుతారు. శని గ్రహం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడటానికి శనివారం ఎర్ర మిరపకాయను తినకూడదు. ఈరోజు ఎర్ర మిరపకాయలు తింటే శని ఆగ్రహానికి గురవుతారు.
పెరుగు
శనివారం తినకూడని ఆహారాల జాబితాలో పాలు కూడా చేర్చబడ్డాయి. శనివారం పాలు తాగకూడదని శాస్త్రం చెబుతుంది. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే పాలు అయినా శనివారం నాడు తాగకూడదు. అదే విధంగా మీరు పెరుగు తినకుండా ఉండాలి. అయితే ఈ రెండిటిని బెల్లంతో కలిపి సేవించవచ్చు.
నల్ల నువ్వులు
శని దేవుడికి అత్యంత ప్రాచుర్యం పొందిన నైవేద్యాలలో నల్ల నువ్వులు కూడా ఒకటి. వీటిని శనివారం నాడు నైవేద్యంగా పెడితే త్వరగా సంతృప్తి చెందుతారు. అయితే ఈ రోజున నల్ల నువ్వులను సేవిస్తే ఖచ్చితంగా వారి ఆగ్రహానికి గురవుతారు. ఇది ఆయనను అవమానించడమేనని భావించారు.
READ ALSO : YASHODA movie 9 Days Collections : బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న యశోద.. సమంత ఖాతాలో మరో హిట్టు..!