Advertisement
ఆచార్య చానక్యుడు గొప్ప జీవిత కోచ్ గా పేరు గాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు.
Advertisement
చాణక్య నీతిలో స్త్రీలు, పురుషులకు సంబంధించి వేరువేరుగా నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. పురుషులు తమ విషయంలో కొన్ని విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. లేకపోతే, వారు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.
వ్యక్తిగత రహస్యాలు
పురుషులు తమ వ్యక్తిగత రహస్యాలను ఎవరి ముందు వెల్లడించకూడదు. వారు కొన్ని విషయాలను తమ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. వ్యక్తిగత రహస్యాలను చెప్పిన పక్షంలో జీవితాంతం సమస్యలు వెంటాడుతాయి.
అవమానం
మీరు ఏ విధమైన అవమానానికి గురైన ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. మీకు ఎదురైన అవమానం గురించి ఇతరులకు చెబితే మీ ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అందుకే మీకు ఎదురైన అవమానాల గురించి సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా చెప్పకండి. మీలోనే దాచుకోండి.
Advertisement
భార్యతో గొడవలు
భార్య భర్తల మధ్య గొడవలు సాధారణమే అయినప్పటికీ, ఆ విషయాలను ఇతరులకు తెలియజేయవద్దు. మీ సన్నిహితుల ముందు మీ భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయాలు చెప్పకండి. లేదంటే మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. గొడవలు పడే భార్య భర్తలకు సమాజంలో గౌరవం తగ్గిపోతుంది.
బలహీనతలు
ప్రతి వ్యక్తికి అతని వ్యక్తిత్వంలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మీలోని బలహీనతల గురించి ఎవరికీ చెప్పకండి. అలా కాదని ఎవరికైనా చెబితే వారు మిమ్మల్ని అనచి వేయడానికి ప్రయత్నిస్తారు. మీ బలహీనతలను ఉపయోగించుకుంటారు. మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
ఆర్థిక పరిస్థితి
మీ ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరికీ చెప్పకండి. సమస్యలను అధిగమించేందుకు డబ్బు ఉపయోగపడుతుంది. మీ దగ్గర అధికంగా డబ్బు ఉంటే, అది మీ బంధువులకు తెలిసినప్పుడు, వారు దానిని దొంగిలించడానికి, లేదా మీకు హాని చేసి దానిని సొంతం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ఆచార్య చాణక్య హెచ్చరించారు.
Read also : విక్రమ్ నుంచి శోభిత వరకు పొన్నియన్ సెల్వన్-1 మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ?