Advertisement
ఆడవారికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఆఖరికి ఆకాశంలో కూడా వదలడం లేదు. రన్నింగ్ ఫ్లైట్ లోనూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళల్ని ఘోరంగా అవమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు ఓ వ్యక్తి. ఆ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. తాజాగా మరో సంఘటన వెలుగుచూసింది.
Advertisement
ప్యారిస్-ఢిల్లీ సెక్టార్ లో ఓ మహిళకు చెందిన బ్లాంకెట్ పై మూత్ర విసర్జన చేశాడో వ్యక్తి. అయితే.. తన చర్యకు అతను లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఎయిరిండియా విమానం-142లో డిసెంబరు 6న ఈ ఘటన జరిగింది. పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి తెలియజేశారు. దీంతో ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు.
అయితే.. అతను అపాలజీ చెప్పడంతో ఆ మహిళా ప్రయాణికురాలు వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. మొదట ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా.. పోలీస్ కేసు పెట్టేందుకు నిరాకరించిందట. దీంతో అతగాడు విమానాశ్రయం నుంచి సేఫ్ గా బయటపడ్డాడని ఆయా వర్గాలు తెలిపాయి.
Advertisement
మరోవైపు నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. బిజినెస్ క్లా స్‍లో ప్రయాణిస్తుండగా.. 70 సంవత్సరాల వయసు ఉన్న మహిళపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు వారించారు. అయినా మూత్రం పోసిన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి చాలాసేపు కదల్లేదని తెలిసింది. ఈ ఘటనతో ఎంతో ఆవేదన చెందిన ఆ మహిళా ప్రయాణికురాలు.. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు లేఖ రాశారని సమాచారం. విమానంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ లేఖ ద్వారా ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఎయిర్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. దారుణంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని విమానం ఎక్కేందుకు వీలు లేకుండా నో ఫ్లై లిస్టులో చేర్చాలని విమానయాన శాఖకు ప్రతిపాదన పంపింది. మరోవైపు, ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.