Advertisement
సాధారణంగా మందు తాగినప్పుడు మత్తు ఎక్కడం సహజం. ఆ మత్తులో ఏమి చేస్తూంటామో తెలియదు. మన మనసులో ఎప్పటినుంచో ఉండిపోయిన విషయాలను మనకు తెలియకుండానే మత్తులో వాగేస్తూ ఉంటాము. మందు తాగిన వారికి ఎమోషనల్ ఇంబ్యాలన్సు అవుతాయి. ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఆ మత్తులో మన భావోద్వేగాల పట్ల బాలన్స్ ని కోల్పోయి ఎదుటి వారితో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మందు ఎక్కువైనప్పుడు మన మనసులో ఉన్న వారితో ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటాం.
Advertisement
అందుకే.. చాలా మంది మందు తాగిన మత్తులో వద్దు అనుకున్నా.. తమ ఎక్స్ లవర్ కి మెసేజ్ చేయడాలు, కాల్ చేసి పిచ్చి పిచ్చి గా వాగడాలు చేస్తూ ఉంటాం. అయితే.. మీరెప్పుడైనా తాగి మీ లవర్ కి మెసేజ్ చేసారా? చాలా మంది చేసే ఉంటారు. ఎప్పుడైనా తాగిన మత్తులో మీ బాస్ కి మెసేజ్ చేసారా? చేయలేదు కదా.. కానీ, ఈ అబ్బాయి మాత్రం తాగిన మత్తులో తన బాస్ కి మెసేజ్ చేసాడు. ఇంతకీ అతను ఏమి మెసేజ్ చేసాడో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఒక బాస్ మరియు ఉద్యోగి మధ్య జరిగిన హృదయపూర్వక పరస్పర చాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisement
రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉద్యోగి నుంచి వచ్చిన అనుకోని మెసేజ్ చూసి ఆ బాస్ షాక్ అయ్యాడు. అయితే ఆ మెసేజ్ లో ఎక్కడా తక్కువ చేసి మాట్లాడినట్లు లేదు. ఆ ఎంప్లాయ్ సంతోషంతో థాంక్స్ చెప్పాడు. “డియర్ బాస్, నేను తాగేసి ఉన్నాను. మీకు నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను ఇంతలా నమ్మినందుకు చాలా థాంక్స్. అనుక్షణం నన్ను వెన్నంటి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు” అంటూ సదరు ఉద్యోగి తెలియ చేసాడు. ఆ మెస్సేజ్ లను సదరు బాస్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. బాస్, ఎంప్లాయ్ మధ్య ఉన్న ఈ ఆహ్లాదకర రిలేషన్ ను నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు.
మరిన్ని..
ఎస్ అక్షరంతో పేరు స్టార్ట్ అయితే.. ఇండస్ట్రీలో తిరుగు ఉండదు..!