Advertisement
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఎక్కువైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని పోస్టర్లపై ఉన్నప్పటికి.. తెలుగు లో రిలీజ్ అయ్యిన సమయంలోనే ఇతర భాషలలో కూడా రిలీజ్ అవ్వడం అనేది జరగడం లేదు.
Advertisement
కానీ, ఇతర భాషా సినిమాల విషయం వచ్చేసరికి ఆ సినిమాలు తెలుగులో కూడా అదే రోజున విడుదల అవ్వడం జరుగుతోంది. నిజానికి తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూస్తుంటారు. ఒకరకంగా పక్కన భాషా సినిమాలను నెత్తిన పెట్టుకుని మరీ చూస్తారు.
కానీ, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉండదు. అక్కడి వారు ముందు తమ భాషా చిత్రాలను చూడడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత పక్క భాషల సినిమాల గురించి ఆలోచిస్తారు. అందుకే.. మన సినిమాలు ఇతర భాషల్లో కూడా విడుదల అవ్వాలంటే ఆలస్యం అవుతోంది. పోనీ తెలుగు నాటే, ఎక్కువ థియేటర్లలో మన సినిమాలను రిలీజ్ చెయ్యాలంటే.. ఇక్కడ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది. భోళా శంకర్ సినిమా టైం లో కూడా జైలర్ కె ఎక్కువ థియేటర్లు దొరికాయి.
Advertisement
ఆ సినిమా కంటెంట్ నచ్చలేదు కాబట్టి.. సరేలే అని సరిపెట్టుకున్నా.. తాజాగా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్రావు సినిమాల కంటే కూడా లియో సినిమాకే ఎక్కువగా థియేటర్లు దొరికాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చెయ్యాలి.
కానీ, డబ్బింగ్ సినిమాలు రెంట్ లెక్కన దొరుకుతాయి కాబట్టి తెలుగు సినిమా నిర్మాతలకు గట్టి దెబ్బె తగులుతోంది. దీనివలన నిర్మాతలకు కాదు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా నష్టం వస్తోంది. పండుగల సీజన్ లో డబ్బింగ్ సినిమాల రిలీజ్ ఉండకూడదు అన్న రూల్ ఉండాలి అంటూ డిస్ట్రిబ్యూటర్లు విన్నవించుకుంటున్నారు.