Advertisement
Dulquer Salmaan Chup Movie Review: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘చుప్’ ఓటిటి లోకి తాజాగా వచ్చింది. విలక్షణ కథాంశాలతో దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో హీరోగా చక్కటి విజయాన్ని అందుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. అతడు హీరోగా నటించిన హిందీ సినిమా చుప్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీరియల్ కిల్లర్ కథతో డైరెక్టర్ ఆర్ బాల్కి చుప్ సినిమాను తెరకెక్కించాడు.
Advertisement
Dulquer Salmaan Chup Movie Review
Dulquer Salmaan Chup Movie Story కథ మరియు విశ్లేషణ:
ముంబైలో ఒకరి తర్వాత మరొకరు అన్నట్లు హత్యలు జరుగుతుంటాయి. సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్ ని టార్గెట్ గా చేసుకుని రివ్యూ ఏ స్టైల్ లో అయితే రాశారో, ఓ సీరియల్ కిల్లర్ అలానే చంపేస్తుంటాడు. అతడిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాండ్ ఆఫీసర్ అరవింద్ ప్రయత్నిస్తుంటాడు. తక్కువ రేటింగ్ ఇస్తే కిల్లర్ చంపేస్తాడేమోనని భయపడి, పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. అయినా సరే హత్యలు ఆగవు. దాంతో క్రిటిక్స్ పూర్తిగా రివ్యూలు రాయడమే మానేస్తారు. ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ నీలామీనన్ తో అరవింద్ ఓ రివ్యూ రాయిస్తాడు. మొదట్లో ధైర్యంగా ఉన్న నీలా, తర్వాత భయపడుతుంది. పోలీసులు అండగా ఉన్నప్పటికీ భయపడుతుంది. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ డానీ ఏం చేశాడు? వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి? పోలీసులు ఫైనల్ గా సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Advertisement
Dulquer Salmaan’ Latest Movie CHup
చుప్ మూవీ కాన్సెప్ట్ బాగుంది. చెప్పాలంటే కొత్తగా ఉంది. సినిమాలకు స్టార్ రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు రాసే వాళ్ళని చంపేసి, వాళ్ళ నుదిటిపై కిల్లర్ స్టార్ రేటింగ్ వేసే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్కొక్కరిని చంపేసిన తీరు, ఒళ్ళు జలధరించేలా చేస్తుంది. క్రికెట్ స్టేడియంలో అయితే మరి దారుణంగా ఉంటుంది. సినిమా చాలా థ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఆ తర్వాత చూస్తుంటే, చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఆ సస్పెన్స్, థ్రిల్ ని మెంటైన్ చేసిన డైరెక్టర్, ఆ తర్వాత మాత్రం స్టొరీ పూర్తిగా టాక్ తప్పింది. ఎందుకంటే స్టోరీ బ్యాక్ గ్రౌండ్ బాగున్నప్పటికీ, రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ చూసేవారు. అతడిని కనిపెట్టేస్తారు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి క్లూస్ అందుతూ ఉంటాయి.
ప్లస్ పాయింట్స్:
దుల్కర్ యాక్టింగ్
దుల్కర్-శ్రియ కెమిస్ట్రీ ఫస్టాఫ్ లో థ్రిల్లింగ్ కథనం
బాల్కి డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో స్లో కథనం
క్లైమాక్స్ లో నార్మల్ ఎండింగ్
రేటింగ్ : 2.5/5.
Read also: అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే